Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుడిగాలి సుధీర్ ఇంట్లో కరోనా విషాదం.. ప్రోమో విడుదల

Webdunia
సోమవారం, 17 మే 2021 (20:26 IST)
కోవిడ్ మహమ్మారి జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇంట్లోనూ విషాదం నింపింది. సుధీర్ అమ్మమ్మ ఇటీవలే కరోనాతో బాధపడుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వేదికగా ఆటో రాంప్రసాద్ తెలిపారు. అమ్మమ్మ చనిపోయినా సుధీర్ వెళ్లలేకపోయాడని.. చివరి చూపు కూడా దక్కలేదని వెల్లడించారు. ఆదివారం ఈటీవీలో ప్రసారం కావాల్సిన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమో యూట్యూబ్‌లో విడుదలయింది. 
 
అందులో ఎప్పటిలాగే కామెడీతో పాటు ఈసారి కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకమైన స్కిట్ చేశారు. అందరూ ఇంట్లోనే ఉండాలని.. మీరు చేసే చిన్న పొరపాటు వల్ల కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని అందులో తెలిపారు. అందులో ఆటో రాంప్రసాద్ అద్భుతంగా నటించారు.
 
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందని.. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండాలని ఈ కార్యక్రమం ద్వారా వీక్షకులకు సూచించారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని చెప్పారు. ఇక సుధీర్ అమ్మమ్మ మరణించారని రాంప్రసాద్ ఈ విషయాన్ని చెబుతుంటే ఆయన పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments