#Saahotrailer10thAugust... ఐదు సిటీల్లో ప్రభాస్ ఫ్యాన్స్ మధ్యలో...

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (15:04 IST)
ప్రభాస్ నటించిన సాహో ట్రెయిలర్ ఆగస్టు 10 రిలీజ్ కాబోతోంది. అభిమానుల మధ్య ముంబై, చెన్నై, కోచి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఈ ట్రెయిలర్‌ను లాంఛ్ చేయబోతున్నారు ప్రభాస్. ఈ సందర్భంగా అభిమానులతో ప్రభాస్ సాహో అనుభవాలను పంచుకోనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఆగస్టు 30న విడుదల కాబోతోంది.
 
సాహో విడుదలకు రెడీ అయ్యేందుకు సిద్ధమౌతోన్న సందర్భంలో.... సినిమాలో నటించిన ఒక్కో పాత్రను పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, శ్రద్ధా కపూర్ లుక్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నటుడు అరుణ్ విజయ్ లుక్‌ని విడుదల చేశారు. తమిళంలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో... విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ.. మంచి పేరు తెచ్చుకున్న అరుణ్ విజయ్ సాహోలో అద్భుతమైన పాత్రతో మెప్పించబోతున్నాడు. 
 
భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమాలోని ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. అలాగే అరుణ్ విజయ్ పాత్ర సినిమాలో చాలా కీలకం. ఈ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. "Blood doesn't need bloody invitation" అనే క్యాప్షన్‌ని బట్టే ఈ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా వుండనుందో అర్థం చేసుకోవచ్చు. 
 
యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌గా యు.వీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్‌లు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం సాహో. యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కుతుంది. ఈ చిత్రం ఆగ‌ష్టు 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. 
 
బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టంతో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యంలో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్‌కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటితో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments