Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో' టీజర్-2 అదిరింది... అచ్చం హాలీవుడ్ తరహాలో...

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (13:47 IST)
'బాహుబలి' వంటి బిగ్గెస్ట్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'సాహో'. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. ఆమె పుట్టిన రోజు సందర్భంగా 'సాహో' టీజర్ 2ను ఆదివారం విడుదల చేసింది. బాలీవుడ్‌లో పలు చిత్రాలతో బిజీగా ఉన్న శ్రద్ధాకపూర్, స్ట్రీట్ డ్యాన్స‌ర్ అనే బాలీవుడ్ సినిమాతో పాటు 'సాహో' చిత్రం కూడా చేస్తోంది. 'సాహో' చిత్రంతో ఈ అమ్మ‌డు తెలుగు తెర‌కి తొలిసారి పరిచయమవుతోంది. 
 
"షేడ్స్ ఆఫ్ సాహో- చాప్ట‌ర్ 2" పేరుతో మేకింగ్ షాట్స్ ఈ టీజర్‌లో ఉన్నాయి. ఇందులోని యాక్షన్ స‌న్నివేశాలు హాలీవుడ్ సినిమాని త‌లపిస్తున్నాయి. బుల్లెట్ల వర్షం కురిసింది. చివరకు శ్రద్ధా కపూర్ సైతం గన్‌షాట్స్ చెయ్యడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ప్ర‌భాస్, శ్ర‌ద్ధా లుక్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. రెండో టీజర్‌లో కూడా ప్రభాస్ ఆఖరులో కనిపించి బూమ్ అంటూ దుమ్మురేపాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన షెడ్స్‌ ఆఫ్ సాహో మొదటి ఛాప్టర్‌కు విశేష స్పందన వచ్చింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న 'సాహో' చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్‌నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మురళీ శర్మ, మలయాళం యాక్టర్‌ లాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  సినిమా 2019లో థియేటర్స్‌కు రానుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

దక్షిణాసియా- రష్యా అనుసంధానం.. రైలు, రోడ్డు మార్గం ఏర్పాటు.. పాక్-రష్యా గ్రీన్ సిగ్నల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments