Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో'' నుంచి షేడ్స్ ఆఫ్ సాహో వీడియో వచ్చేసింది.. ప్రభాస్ లుక్ అదుర్స్ (వీడియో)

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (12:55 IST)
బాహుబలి సినిమాతో వరల్డ్ స్టార్‌గా మారిపోయిన ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే దుబాయ్‌లో జరిగింది. ఈ సినిమా షూటింగ్ భారీ ఖర్చుతో జరిగిందని.. ఈ సినిమా యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ ప్రముఖులు బరిలోకి దిగారని టాక్ వచ్చింది.


ఈ టాక్‌ను నిజం చేసేలా.. అక్టోబర్ 23.. ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే వీడియో.. సాహో టీమ్ నుంచి రిలీజ్ అయ్యింది. ''షేడ్స్ ఆఫ్ సాహో'' పేరుతో ప్రమోషనల్ వీడియోను సినీ యూనిట్ విడుదల చేసింది. 
 
రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రభాస్ ఇమేజ్‌కు తగినట్లు అత్యాధునిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ సుందరి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రద్ధా కపూర్‌‍తో పాటు మందిరా బేడి, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్ తదితరులు బాలీవుడ్ దిగ్గజాలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 
 
తాజా ''షేడ్స్ ఆఫ్ సాహో'' వీడియోలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో వున్నాయి. ప్రముఖ హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్ కెన్నీ బటీస్ పలు యాక్షన్ సన్నివేశాలను ప్రభాస్‌పై చిత్రీకరించారు. రియల్ స్టంట్స్‌తో ప్రభాస్ చేసిన ప్రయోగం అదిరిపోయింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments