Webdunia - Bharat's app for daily news and videos

Install App

''దంగల్''ను బీట్ చేసిన ''సాహో'' అంతా కరోనా ఎఫెక్ట్..

Webdunia
గురువారం, 23 జులై 2020 (11:25 IST)
బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ అభిమానులకు అభిమాన హీరోగా మారాడు. బాహుబలి ద్వారా అంతర్జాతీయ స్టార్ స్థాయికి ఎదిగిపోయాడు. కరోనా కారణంగా లాక్ డౌన్‌లలో సడలింపులు వచ్చాయి. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు సాధారణ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. జపాన్‌లో ఇటీవలే సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. అక్కడి ప్రజలు సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారు. 
 
మనదేశంలో అయితే ఇంకా థియేటర్లు ప్రారంభం కాలేదు, సినిమా షూటింగులు జరుగుతున్నాయి. 'బాహుబలి'తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జపాన్‌లోనూ వీరాభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే ప్రభాస్ నటించిన 'సాహో' జనవరిలో జపాన్‌లో విడుదలైంది.
 
ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే కరోనా మహమ్మారి విజృంభించడంతో అక్కడి థియేటర్లు మూతపడ్డాయి. అక్కడి థియేటర్లను తెరిచిన తర్వాత మరోసారి ఈ సినిమాను విడుదల చేశారు. తాజా రిపోర్టుల ప్రకారం జపాన్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా `సాహో` రికార్డు నెలకొల్పింది.
 
గతంలో 2 ఈ రికార్డు అమీర్‌ఖాన్ 'దంగల్' సినిమా పేరుతో వుండేదన్న సంగతి తెలిసిందే. అలాగే జపాన్‌లో ఓవరాల్‌గా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 ఇండియన్ సినిమాల జాబితాలో 'సాహో' కూడా చేరింది. సాహో'తోపాటు 'ఇంగ్లీష్ వింగ్లీష్', '3 ఇడియెట్స్', 'ముత్తు', 'బాహుబలి-2' టాప్ 5లో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments