Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీలో ఆర్ఎక్స్ 100 రీమేక్.. కార్తీకేయగా అహన్ శెట్టి?

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (12:36 IST)
ఆర్ఎక్స్ 100 చిత్రం టాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన హీరో కార్తికేయ... ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తాజాగా నాని గ్యాంగ్ లీడ‌ర్‌లో విల‌న్‌గా కనిపించ‌నున్నాడు. ఇక‌ హిప్పీ అనే చిత్రంతో కోలీవుడ్‌కి ఎంట్రీ కూడా ఇచ్చాడు. 
 
హిప్పీ చిత్రాన్ని టీఎన్ కృష్ణ తెర‌కెక్కిస్తున్నాడు. ఇంకా డైరెక్ట‌ర్ శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ ఓ సినిమా చేయ‌నుండ‌గా, ఈ చిత్రానికి 90ఎంఎల్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ చిత్రంకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆర్ఎక్స్ సినిమా హిందీలో రీమేక్ కానుంది. ఈ సినిమాలో కార్తీకేయ పోషించిన పాత్రలో సీనియర్ హీరో సునీల్ శెట్టి వారసుడు 'అహన్ శెట్టి' కనిపించనున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయం అవుతున్నాడు.
 
మిలన్ లుథ్రియా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. సాజిద్ నడియాద్వాలా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చేనెలలో ఈ సినిమా షూటింగు మొదలు కానుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ 'స్టీఫెన్ రిచ్చర్'ను ఈ సినిమా కోసం రంగంలోకి దింపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో ఎన్డీఏ నాలుగోసారి అధికారంలోకి వస్తుంది: చంద్రబాబు నాయుడు

ఫ్యాన్సీ నంబర్ వేలం- TG09G9999 రూ.25.5లక్షలకు కొనుగోలు

ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు.. మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చ

ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జస్ట్ మిస్

SVSN Varma: వర్మను లాక్కెళ్లిన రాకాసి అలలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments