Webdunia - Bharat's app for daily news and videos

Install App

RRRపై సూపర్ అప్డేట్.. దీపావళికి టీజర్.. జనవరి 7న సినిమా రిలీజ్?!

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (18:43 IST)
RRR
పాన్-ఇండియా చిత్రం RRRపై భారీ అంచనాలున్నాయి. టాలీవుడ్‌తో పాటు మిగతా ఇండస్ట్రీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమాగా ఆర్ఆర్‌ఆర్ వుంది. ఈ భారీ మల్టీ స్టారర్ కోసం అన్ని పరిశ్రమ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కరోనా కారణంగా మరింత ఆలస్యమైంది అసలు దసరా సీజన్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు.
 
తాజాగా "సినిమా బృందం త్వరలో ఫ్యాన్సుకు కిక్కిచ్చే ప్రకటన ఇవ్వబోతోంది. టీమ్ త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లను కూడా ప్రారంభిస్తుంది. జనవరి 7వ తేదీన ఈ చిత్రం విడుదల అవుతుందని అంచనా వేస్తున్నారు. 
 
ఇక ఎట్టకేలకు రాజమౌళి ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడంతో ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ వీడి పోయింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్ ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుంటే.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.
 
ఇందులో చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.. ఎన్టీఆర్ కు జోడీగా విదేశీ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుంది. ఇక ఈ సినిమా నుండి ఒక అప్డేట్ అందుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 29న ఈ సినిమా నుండి ఒక పోస్టర్ వదల బోతున్నట్టు తెలుస్తుంది. ఈ పోస్టర్ తో పాటు టీజర్ రిలీజ్ డాట్, టైం కూడా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. 
 
ఈ సినిమా నుండి టీజర్ ను దీపావళి కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో జక్కన్న ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాడని అంటున్నారు. మరి ఈ సినిమా నుండి టీజర్ వస్తే మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన డివివి దానయ్య నిర్మించారు. నార్త్ ఇండియా హక్కులను PEN Studios సొంతం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments