Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వర్ణ దేవాలయంలో 'ఆర్ఆర్ఆర్' బృందం

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (13:44 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిన చిత్రం "ఆర్ఆర్ఆర్" ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటించిన ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, అలియా భట్, శ్రియ తదితరులు నటించారు. 
 
అయితే, మరో నాలుగు రోజుల్లో సినిమా విడుదలవుతుండటంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్స్‌ను జోరుగా చేస్తుంది. ఇప్పటికే కర్నాటక, ఢిల్లీ, దుబాయ్‌లలో ఈ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది. 
 
ఆదివారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత చిత్ర బృందం అటు నుంచి నేరుగా అమృతసర్‌కు వెళ్లి చిత్రం విజయం కోసం స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 
 
ముగ్గురు 'ఆర్ఆర్ఆర్‌'లు (రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌)లు పంజాబీ సంప్రదాయంలో తలకు వస్త్రం చుట్టుకుని అక్కడ నది ఒడ్డున ప్రార్థిస్తున్నట్టున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని ఈ సందర్భంగా వారు మనస్ఫూర్తిగా కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments