Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్"ను ప్రపంచమే మెచ్చింది.. ఇక ఆస్కార్ ఎందుకు? హీరో నిఖిల్

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (13:08 IST)
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. ఇటీవల "కార్తికేయ-2" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రం నిఖిల్‌కు కాసుల వర్షం కురిపించింది. ఈ నేపత్యంలో 2023 ఆస్కార్ అవార్డులకు "ఆర్ఆర్ఆర్" చిత్రం నామినేట్ అవుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, అది సాధ్యం కాలేదు. 
 
ఈ అంశంపై నిఖిల్ సిద్ధార్థ్ స్పందించాడు. ప్రపంచం మెచ్చిన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఇక ఆస్కార్ అవార్డు ఎందుకు అంటూ ప్రశ్నించారు. తనకు ఆస్కార్ అవార్డులపై పెద్ద ఆసక్తి లేదన్నారు. మంచి అభిప్రాయం కూడా లేదన్నారు. సినిమాలుక ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఆస్కార్ కంటే ఎక్కువ అని చెప్పారు. మనకు ఫిల్మ్ ఫేర్, జాతీయ అవార్డులు ఉన్నాయి. అలాంటప్పుడు ఆస్కార్ అవార్డులు మనకెందుకని నిఖిల్ ప్రశ్నించాడు. 
 
ముఖ్యంగా, ఇటీవలి కాలంలో భారతీయ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరిగిందన్నారు. తాను ఇటీవల స్పెయిన్‌కు వెళ్లినప్పుడు అక్కడ 'ఆర్ఆర్ఆర్' చూశానని.. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లన్నీ ఫుల్‌గా ఉన్నాయని తెలిపారు. స్పెయిన్‌లోనే కాకుండా... సినిమా విడుదలైన అన్ని దేశాల్లో బ్రహ్మాండంగా ఆడుతోందని చెప్పారు. ఇంతకు మించి మనకు ఏం కావాలని... ఆస్కార్ మనకు అవసరమా? అని నిఖిల్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేపాల్ వెళ్లొద్దు, మాజీ ప్రధాని ఇంటికి నిప్పు, మంటల్లో ఆయన సతీమణి మృతి

మార్చురీకి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. 'సార్.. నేను బతికే ఉన్నాను' అంటూ లేచి కూర్చొన్న వ్యక్తి...

మాటలు సరిగా రాని మైనర్ బాలికపై అత్యాచారం

చంద్రబాబు అరెస్టు చేసిన ఆరోజు, నేటితో రెండేళ్లు - కీలక మలుపు తిప్పిన ఘటన

గ్రహణం రోజున తలపై మండే కుంపటితో అఘోర శ్రీనివాసరావు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

తర్వాతి కథనం
Show comments