Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవర్ బాయ్ తరుణ్‌కు పెళ్లైపోతుందట.. ఓవియాతో (ట్రైలర్)

లవర్ బాయ్ తరుణ్ చాలా గ్యాప్ తర్వాత వెండితెరపై కనిపించనున్నాడు. ''ఇది నా లవ్ స్టోరీ'' అనే టైటిల్‌తో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్లో ''కాళ్లు కడిగి కన్యాదానం చేస్తే చాలు..

Webdunia
సోమవారం, 15 జనవరి 2018 (14:25 IST)
లవర్ బాయ్ తరుణ్ చాలా గ్యాప్ తర్వాత వెండితెరపై కనిపించనున్నాడు. ''ఇది నా లవ్ స్టోరీ'' అనే టైటిల్‌తో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్లో ''కాళ్లు కడిగి కన్యాదానం చేస్తే చాలు.. కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాం''అని తన ప్రేయసితో తరుణ్ చెప్పుకొచ్చిన డైలాగ్ బాగుంది. ఇందులో తరుణ్ డైలాగ్స్ బాగున్నాయి. తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఓవియా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ట్రైలర్లో ఓవియాతో లవ్ సీన్స్ అదిరాయి.
 
రామ్‌ ఎంటర్‌టైనర్స్‌ పతాకంపై ప్రకాశ్‌ ఎస్వీ ఈ సినిమాని నిర్మించాడు. అంతా ఓకే అయితే ఫిబ్రవరి 14న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తరుణ్ పెళ్లి విషయం గురించి ఆయన తల్లి, నటి రోజా రమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
తరుణ్‌కు మంచి అమ్మాయి దొరికినే వెంటనే పెళ్లి చేసేస్తామని రోజా రమణి తెలిపారు. తన కుమార్తె అమూల్య ఇంటీరియర్ డిజైనింగ్ చేసిందని... తన ప్రాజెక్టుల్లో బిజీగా ఉందని...  మంచి అమ్మాయి, మంచి అబ్బాయి దొరికితే ఇద్దరికీ పెళ్లి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరికీ అమ్మాయి, అబ్బాయి వెతికే పనిలో పడ్డామని తెలిపారు. బహుశా ఈ వార్తను ఈ ఏడాదిలోనే వినవచ్చని తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుడమికి చేరిన సునీతా విలియమ్స్... ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలేంటి?

హమాస్‌తో సంబంధాలు.. అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు

Marri Rajasekhar: వైకాపాకు మరో ఎదురుదెబ్బ- ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా (video)

Vishnupriya: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు యాంకర్ విష్ణుప్రియ

Rain: వేసవి కాలంలో వర్షాలు పడే అవకాశాలు.. మార్చి 22, 23 తేదీల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments