Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి దూరం చేసింది.. ఇపుడు నటిననే సంగతే మరిచిపోయాను...

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2020 (11:22 IST)
బాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో ఒకరు మధుబాల. మణిరత్రం దర్శకత్వం వచ్చిన "రోజా" చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన జెంటిల్‌మేన్ చిత్రంలో ఈ అమ్మడు నటించి, అన్ని భాషల ప్రక్షకులను మెప్పించింది. 
 
ఈ మధుబాల... దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా నటిగా తనదైన ముద్రవేసింది. కానీ పెళ్లి తర్వాత సినీ రంగానికి దూరమయ్యారు. చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడు నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. దసరా సందర్భంగా మధుబాల తాజాగా ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
'1999లో పెళ్లైన తర్వాత సినిమా రంగానికి దూరమైయ్యాను. పూర్తిగా నా సమయాన్నంతా కుటుంబానికే కేటాయించాను. నేను నటిననే సంగతే మరచిపోయాను. పిల్లలు పెరిగి పెద్ద వాళ్లయ్యాక ప్రతి విషయంలోనూ నేను వారికి నా సపోర్ట్‌ అందించాల్సిన అవసరం లేదనిపించింది. 
 
అప్పుడు నాలోని నటి మేల్కొంది. దాంతో చిన్న చిన్న పాత్రలు వేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు ఇండస్ట్రీలోని ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ అందరూ యంగ్‌ జనరేషన్స్‌. సెట్స్‌లోకి నేను వెళ్లినప్పుడు 10-15 ఏళ్లుగా నేను ఏ సినిమా చేయకపోయినా వారు నటిగా నాకు ఎంతో గౌరవం ఇస్తున్నారు. మా అమ్మగారు భరతనాట్యం డాన్సర్‌. హేమామాలినిగారు నాకు బంధువు అవుతారు. నేను ఆమెతో ఉన్నప్పుడు పెద్ద నటీనటులను కలుసుకునే అవకాశం కలిగింది' అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments