'రైజ్ ఆఫ్ శ్యామ్' అంటున్న నాని.. లిరికల్ సాంగ్ రిలీజ్

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (17:31 IST)
నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం "శ్యామ్ సింగ రాయ్". 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని 1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో డిసెంబర్ 24న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. 
 
ఇందులోభాగంగా, 'రైజ్ ఆఫ్ శ్యామ్' ఫుల్ లిరికల్ సాంగ్‌ని శనివారం ఉదయం విడుదల చేసింది. బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీ పాడిన ఈ పాట ఉర్రూత‌లూగిస్తుంది. "అరే ఎగసెగిసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్.. అరే తిరగబడిన సంగ్రామం వాడే.." అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది. శ్యామ్ సింగ రాయ్ ఒక లెజెండ్‌గా ఎలా మారాడో ఈ పాట వివరిస్తుంది. మెలోడీ సాంగ్స్ స్పెసిలిస్ట్‌గా పిలబడే మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు. 
 
కాగా, ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హీరోయిన్లుగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ నటించారు. ఇది నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం కావడం గమనరాహ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‍‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం