Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ కేసు.. 12వేల పేజీలతో ఛార్జీ షీట్.. రియాతో పాటు 33మంది పేర్లు

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (09:58 IST)
గ‌తేడాది జూన్ 14న ముంబ‌యిలోని త‌న ఇంట్లో విగ‌త‌జీవిగా కనిపించాడు న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. లాక్‌డౌన్ స‌మ‌యంలో అత‌డి మ‌ర‌ణం అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. మొద‌ట్లో డిప్రెష‌న్‌తో సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన‌ప్పటికీ.. త‌రువాత చాలా అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి.

మ‌రోవైపు త‌మ కుమారుడి డ‌బ్బును రియా, ఆమె కుటుంబం వాడుకుంద‌ని సుశాంత్ కుటుంబం కేసు న‌మోదు చేసింది. దీంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాలంటూ అభిమానులు స‌హా ప‌లువురు డిమాండ్ చేయ‌డంతో సీబీఐ కూడా ఈ కేసులో భాగం అయ్యింది. 
 
ఇక సుశాంత్ కేసులో డ్ర‌గ్స్ కోణం కూడా బ‌య‌ట‌ప‌డ‌గ్గా.. ఎన్సీబీ అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె సోద‌రుడు షోవిక్, బాలీవుడ్ నటీన‌టులు అర్జున్ రాంపాల్, దీపికా ప‌దుకొనే, శ్ర‌ద్దా క‌పూర్, ర‌కుల్ ప్రీత్ సింగ్ స‌హా ప‌లువురిని విచారించారు. వీరిలో 33 మందిపై ఆరోప‌ణ‌లు రాగా.. వారిని అరెస్ట్ చేసి విచారించారు. అందులో ఎనిమిది మంది ఇప్ప‌టికీ జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్నారు.
 
ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఛార్జీషీట్ సిద్ధం చేశారు పోలీసులు. రాజ్ పుత్ మృతి కేసులో డ్ర‌గ్స్ కోణం బ‌య‌ట‌పడిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన ఎన్సీబీ అధికారులు ప‌లువురిని విచారించారు. ఇక తాజాగా ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్‌ని ప్రిపేర్ చేశారు అధికారులు. 12వేల‌ పేజీల‌తో ఈ ఛార్జ్‌షీట్ ఉండ‌గా.. ఇందులో సంబంధం ఉన్న‌ట్లు మొత్తం 33 మంది పేర్ల‌ను పొంద‌పరిచిన‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిల్లలు లేని స్త్రీలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 13 లక్షలు, బీహారులో ప్రకటన, ఏమైంది?

15 చోట్ల పగిలిన తల... 4 ముక్కలైన కాలేయం... బయటకొచ్చిన గుండె... జర్నలిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు!

ఓయో రూమ్స్: బుకింగ్ పాలసీలో ఆ సంస్థ తెచ్చిన మార్పులేంటి? జంటలు తమ రిలేషన్‌కు ఆధారాలు ఇవ్వాలని ఎందుకు చెప్పింది?

భర్త పిల్లలను వదిలేసి బిచ్చగాడితో పారిపోయిన మహిళ.. ఎక్కడ?

పులిని చుట్టుముట్టిన సఫారీ వాహనాలు.. హైకోర్టు సీరియస్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments