Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రిగా మీకు మీ డ్రైవర్‌కి కూడా తేడా లేదా? మంత్రి పేర్నికి ఆర్జీవీ ప్రశ్నల వర్షం

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (13:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. మంగళవారం నుంచి చిత్ర పరిశ్రమ నుంచి దర్శకుడు రాంగోపాల్ వర్మ, ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నానిలు ఒకరిపై ఒకరు ప్రశ్నల వర్షం కురిపించుకుంటున్నారు. ఆర్జీవీకి క్రమక్రమంగా మద్దతు పెరుగుతుంది. దీంతో ఏపీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగారు. మంగళవారం ఆర్జీవీ సంధించిన ప్రశ్నలకు మంత్రి నాని బుధవారం సమాధానమిచ్చారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని ఆర్జీవీ బుధవారం మరికొన్ని ప్రశ్నలను సంధించారు. 
 
గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారు ట్విట్టర్ ద్వారా నన్ను అడిగిన ప్రశ్నలకి నా సమాధానం..  
 
నాని గారు.. చాలా మంది లీడర్ల లా పరుష పదజాలంతో మాట్లాడకుండా డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ.. ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్‌ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ .. అది అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది. 
 
మీరు ఎడారిలో నీళ్ళు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు గ్లాస్ నీళ్ళు 5 లక్షలకి కొనచ్చు. కానీ అది పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనుకుంటే మార్కెట్ అనేది ఉన్నదే దానికి. కార్ కావాలనే కోరికని ఎక్స్ప్లాయిట్ చెయ్యడానికే రకరకాల లగ్జరీ కార్లు తయారు చేసి ఆకర్షిస్తారు. అది తప్పని గవర్నమెంట్ వాటికి అడ్డు కట్ట వేస్తే మనం ఇప్పటికీ కాలి నడకన తిరుగుతూ ఉండేవాళ్ళం. 
 
ముడి పదార్థం 500 రూపాయలు కూడా ఖర్చవ్వని ఒక పెయింటింగ్‌ని, కొనేవాడుంటే 5 కోట్లకి అమ్ముతారు. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే దాంట్లో ఉన్న బ్రాండ్‌కి, ఐడియాకి ఎలా వెల కడతారు? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అడ్వాన్స్మెంట్ అనేది కంటిన్యువస్‌గా అన్ని వస్తువులు ఇంకా, ఇంకా బెటర్‌గా ఉండేలా ప్రయత్నించడం.. బెటరా అవునా కాదా అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు.
 
కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్‌పెరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకి అవసరం.. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన టాక్స్ కోసం. బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్‌కి తెలియకుండా చేసే క్రైమ్. ఓపెన్‌గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది. 
 
ఉదాహరణకి మీకు తెలుసో తెలియదో బాంబే ఢిల్లీలలో వీక్ డే బట్టి, థియేటర్ బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ప్రైజ్‌లు 75 రూపాయల నుండి 2200 రూపాయల వరకూ వేరీ అవుతాయి. వీటన్నింటినీ నియంత్రించేది కేవలం ఓల్డెస్ట్ ఎకనామిక్ థియరీ డిమాండ్ అండ్ సప్లై. 
 
గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కొన్ని విపరీత పరిస్థితుల్లో బియ్యం గోధుమ వంటి ఉత్పత్తి ఎక్కువైపోయి ధర చాలా పడిపోయినప్పుడు కానీ ఉత్పత్తి తక్కువయిపోయి ధర విపరీతంగా పెరిగిపోయినప్పుడు కానీ ఉంటుంది. అలాంటి విపరీత పరిస్థితి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ప్రేక్షకులలో కానీ ఎక్కడ వచ్చిందండీ?
 
లూటీ అనే పదం ఉపయోగించేది బలాన్ని ఉపయోగించి క్రిమినల్‌గా లాక్కున్నప్పుడు... అమ్మేవాడు కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు. ఆ ట్రాన్సాక్షన్ లీగల్‌గా జరిగినప్పుడు గవర్నమెంట్ వాటా టాక్స్ రూపంగా తానంతట తనే వస్తుంది.
 
థియేటర్లనేవి ప్రజా కోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని మీకు ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగంలో కానీ సినిమాటోగ్రఫీ యాక్ట్‌లో కానీ ఈ డెఫినిషన్ ఉందా? మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి, ఆ డెఫినిషన్ మీకు మీరు ఇచ్చుకుంటున్నారు. 
 
థియేటర్లనేవి, జూన్ 19 1905న నికెలోడియోన్ అనే ప్రపంచంలోనే మొట్ట మొదటి థియేటర్ అమెరికాలో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు. అంతేకానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు.. కావాలంటే మీ గవర్నమెంట్‌లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి. 
 
సొసైటీ ఆధునీకతకి ముఖ్య కారణం మోటివేషన్.. ఎందుకంటే ప్రతి మనిషి కూడా మానవ సహజంగా తను ఉన్న పొజిషన్ కన్నా పైకి ఎదగాలని కోరుకుంటాడు. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు, సైంటిస్ట్ ఎవ్వరూ కనిపెట్టలేనిది కనిపెట్టాలనుకుంటాడు. మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు. మీ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకుంటాడు. అలా కోరుకునేది అందరి కన్నా బెటర్ అవ్వాలనే ఒక మోటివేషన్‌తో. ఆ బెటర్‌గా ఉన్నప్పుడు వచ్చే అదనపు సౌఖ్యాలని కట్ చేసినప్పుడు మనిషికి మోటివేషన్ పోతుంది. కమ్యూనిజం ఘోరంగా ఫెయిల్ అయ్యింది అక్కడే.
 
"V-EpiQ" థియేటర్‌లో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్ ఉన్న ఏరియా బట్టి టికెట్ ప్రైజ్ ఎలా పెట్టారు? వివిధ హోటల్స్‌లో ఆ ఆ హోటల్ వాళ్ళు వాళ్ళిచ్చే సౌకర్యాలను బట్టే ప్రైజ్ లిస్ట్ పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వంలో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు, మీ డ్రైవర్‌కు కూడా తేడా లేదా?
 
పేదల కోసం చెయ్యడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు. కానీ దానికోసం పేదల్ని ధనికుల్ని చెయ్యటానికి మీ ప్రభుత్వం పని చెయ్యాలి కానీ ఉన్న ధనికుల్ని పేదల్ని చెయ్యకూడదు. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముంది.
 
నానీ గారు నేను ఒక యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్‌ని.. ఎకనామిక్స్ గురించి నాకు ఏ బీ సీ డీ కూడా తెలియదు. కానీ మీరు అనుమతిస్తే మీ ప్రభుత్వంలో ఉన్న టాప్ ఎకనామిక్స్ ఎక్స్‌పర్ట్‌తో నేను టీవీ డిబేట్‌కి రెడీ.. మా సినిమా ఇండస్ట్రీకి మీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ఈ మిసండర్‌స్టాండింగ్‌ను తొలగిపోవడానికి ఇది చాలా అవసరం అని నా అభిప్రాయం.. థ్యాంక్యూ.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments