Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరివితో తల గోక్కోవడానికి సిద్ధమైన రాంగోపాల్ వర్మ

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (16:54 IST)
మనం చేయరాని పని ఏదైనా చేయాలనుకుంటే మనింట్లో పెద్దవాళ్ళు ఒరే కొరివితో తల గోక్కోవద్దురా అంటుంటారు. అంటే తెలిసి తెలిసి ఇబ్బందుల్లో పడవద్దని. కానీ సంచలనాల దర్సకుడు రాంగోపాల్ వర్మ మరోసారి చర్చకు దారితీసే సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఎలాంటి వివాదంలో ఇరుక్కుని ఇబ్బందులు పడతాడన్నదే ఆశక్తిగా మారుతోంది. 
 
ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ తీసిన రాంగోపాల్ వర్మ రాజకీయంగా చర్చకు తెరలేపారు. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడిఎంకే పార్టీ నాయకురాలిగా ఉన్న శశికళ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు చేస్తానని ప్రకటించాడు రాంగోపాల్ వర్మ.
 
అయితే ముందుగా కెసిఆర్ సినిమానే ఎంచుకున్నాడు. ఈరోజు ట్విట్టర్లో రాంగోపాల్ వర్మ ఒక పోస్ట్ చేశారు. కెసిఆర్.. అగ్రెసివ్ గాంధీ అంటూ ట్యాగ్. ఇది కాస్త వైరల్ అవుతోంది. కెసిఆర్ ముఖం గురించి గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన రాంగోపాల్ వర్మ.. ఆయన జీవిత చరిత్రను ఏవిధంగా తెరకెక్కిస్తారన్నది ఆసక్తికరంగా మారుతోంది. 
 
తెలంగాణా రాష్ట్రం రావడాని కన్నా ముందా లేకుంటే తెలంగాణా వచ్చిన తరువాత కెసిఆర్ గురించా...  లేకుంటే రాజకీయాల్లోకి రాకముందు కెసిఆర్ పరిస్థితి ఏవిధంగా ఉందన్న కోణంలో సినిమా చేస్తున్నాడా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. మిగిలిన వారి గురించి పక్కనబెడితే వర్మ సినిమాలో ఏదైనా తేడా వస్తే మాత్రం వర్మను తెలంగాణ సీఎం కేసీఆర్ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments