Webdunia - Bharat's app for daily news and videos

Install App

Revanth reddy : సిని హీరోలు ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేయాల్సిందే ?

డీవీ
గురువారం, 26 డిశెంబరు 2024 (11:23 IST)
chiru and team at CM chamber
కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డిని సినిమా పెద్దలు అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, మురళీమోహన్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వెంకటేష్, జెమినీ కిరణ్, నాగవంశీ, చిరంజీవి వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా రంగం కొన్ని అంశాలను ఆయన ముందుంచారు. అయితే రేవంత్ రెడ్డి చాలా తెలిపిగా సినీ ప్రముఖులను లాక్ చేశారు. సినీ ప్రముఖులతో జరిగిన సమావేశంలో కొత్త ప్రతిపాదనలు చేసి షాక్ ఇచ్చారు. అయితే, ఆయన ప్రతిపాదనలు  కార్యరూపం దాలుస్తాయా? లేదా? అన్నది వేచి చూడాల్సివుంది.

ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు, టూరిజం కు సంబంధించిన ప్రచారాల్లో వారు ప్రచారం చేయాలి. ఇది అసలు అజెండా.

ప్రజాహితం కోసమే కఠినంగా వుండాలనుకుంటున్నాం అని రేవంత్ రెడ్డి అన్నారు.
 
కులగణ సేకరణలోకూడా సినిపెద్దలు సహకరిస్తూ ప్రమోట్ చేయాలని సూచించినట్లు తెలిసింది.  అదేవిధంగా డ్రెగ్స్ నివారణకు ప్రచారం చేయాలి. సినిమా ఆదాయంలో సెజ్ పన్ను వేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది.
 
మురళీమోహన్ మాట్లాడుతూ, సినిమా ప్రభుత్వంతో సహకారాన్ని కోరుకుంటుంది. ఎప్పుడూ ప్రభుత్వంతో సత్ సంబంధాలు వన్నాయని తెలిపారు. సినిమా అనేది ప్రపంచ మార్కెట్ అయింది కనుక దీనిపై ఆలోచించాల్సివుందని అన్నారు. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ కూడా తమవంతు సహకారాన్ని ప్రభుత్వానికి ఇస్తామని అన్నారు.
 
ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కొనసాగించాలని సినీ పెద్దలు రేవంత్ రెడ్డికి సూచించారు. 
నాగార్జున మాట్లాడుతూ, సినిమా గ్లోబల్ స్థాయిలో వుండాలని ప్రభుత్వం సహకారం కూడా వుండాలని సూచించారు.
 
నెట్ ఫ్లిక్స్, అమెజాన్ అనే సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాలని డి. సురేష్ బాబు సూచన చేశారు. 
బౌన్సర్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి అన్నారు. అన్నింటికీ ప్రభుత్వానికి మేం సహకరిస్తామని రాఘవేంద్రరావు అన్నారు. ఎఫ్.డి.సి. చైర్మన్ గా దిల్ రాజు నియమించడం అభినందనీయమని తెలిపారు.
 
అయితే రేవంత్ రెడ్డి బీజీ షెడ్యూల్ రీత్యా ఎక్కువ సమయం కేటాయించలేదని తెలుస్తోంది. మరోసారి చర్చలు జరపాలని అనుకున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments