Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కబాలి' సినిమా స్ఫూర్తి.. లైంగికదాడి నుంచి మహిళను రక్షించిన రజినీ అభిమాని!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రాన్ని చూసిన ఓ అభిమాని... తమ హీరో స్ఫూర్తితో ఆపదలో ఉన్న ఓ మహిళను రక్షించాడు.

Webdunia
ఆదివారం, 24 జులై 2016 (11:06 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రాన్ని చూసిన ఓ అభిమాని... తమ హీరో స్ఫూర్తితో ఆపదలో ఉన్న ఓ మహిళను రక్షించాడు. ముగ్గురు యువకులు అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఈ చిత్రం స్ఫూర్తితో వారితో పోరాడి ఆమెను కాపాడాడు. ఈ సంఘటన చెన్నై నగరంలోని ఆలందూర్ జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
రజినీకాంత్ తాజా చిత్రం 'కబాలి' గత శుక్రవారం విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని ఆయన అభిమాని వసంతపాల్ తొలి రోజున తొలి షో చూసి ఇంటికి బయలుదేరాడు. అయితే, ఎయిర్‌పోర్టు మార్గంలో ట్రాఫిక్‌ అధికంగా ఉండటంతో మరో మార్గం ద్వారా ఇంటికి వెళ్తున్నాడు. 
 
ఈ క్రమంలో నిర్జన ప్రదేశానికి చేరుకున్నాక.. మహిళ అరుపులు వినిపించాయి. ఆ మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడటం గమనించాడు. వెంటనే పాల్‌ ఆ ముగ్గురిపై ఎదురుదాడికి దిగి పిడిగుద్దులు కురిపించాడు. వారితో ఘర్షణ పడుతున్న సమయంలోనే మహిళ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. ఆ తర్వాత ఆ కామాంధులు కూడా పారిపోయారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుల కోసం గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాదంబరి జెత్వానీ కేసు.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు నోటీసులు

YS Sharmila: గృహ నిర్భంధంలో షర్మిల - పోలీసులకు నన్ను ఆపే హక్కు లేదు

Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ

వేసవి రద్దీ - తిరుపతికి 8 ప్రత్యేక రైళ్ళు : దక్షిణ మధ్య రైల్వే

సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments