Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలా పాల్‍‌కు విజయ్ విడాకులిస్తాడా...? అసలేం జరిగింది...?

ఇద్దరమ్మాయిలతో ఫేమ్ అమలా పాల్ దర్శకుడు విజయ్‌ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలైనట్లు కోలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. అందుకే అమలాపాల్ వచ్చిన అవకాశా

Webdunia
శనివారం, 23 జులై 2016 (18:25 IST)
ఇద్దరమ్మాయిలతో చిత్రం ఫేమ్ అమలా పాల్, దర్శకుడు విజయ్‌ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలైనట్లు కోలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. అందుకే అమలాపాల్ వచ్చిన అవకాశాలను వచ్చినట్లు నటించుకుంటూ పోతుందని టాక్. గతంలో అన్నీ పార్టీలకు తన భర్తతో కలిసొచ్చే అమలాపాల్.. ఒక నెల నుంచి విడిగా వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్‌తో అమలా పాల్ కలిసి కనిపించట్లేదు. 
 
అమలాపాల్ - ధనుష్ నటిస్తోన్న వెట్రిమారన్ చిత్రంలో కథానాయికగా నటించడానికి అంగీకరించగా అది విజయ్‌కి ఇష్టం లేదని అందుకే ఆమెను పక్కనబెట్టినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కారణంతోనే విజయ్- అమలా పాల్‌ల మధ్య దూరం ఏర్పడిందని కోలీవుడ్ జనం అనుకుంటున్నారు. 
 
కానీ ఈ వార్తలపై విజయ్-అమలా పాల్ జంట నోరెత్తలేదు. మరోవైపు ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రానికి విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో జయం రవితో కొత్త సినిమాకు దర్శకత్వ పగ్గాలు చేపట్టనున్నాడు. కాగా 2011 దైవ తిరుమగళ్ సినిమా సందర్భంగా అమలా పాల్, విజయ్ ప్రేమలో పడ్డారు. 2014లో వీరిద్దరికీ చెన్నైలో అట్టహాసంగా వివాహమైన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?

Washington: ఆ కుటుంబానికి ఏమైంది..? టెక్కీ కింగ్ అయినా భార్యను, కుమారుడి కాల్చేశాడు.. తర్వాత?

ఏపీలో వైకాపా లిక్కర్ స్కామ్-రూ.3,200 కోట్ల భారీ మోసం.. సిట్ వెల్లడి

భారత్‌పై పాకిస్థాన్ ఎపుడు అణుదాడి చేస్తుంది? రక్షణ రంగ నిపుణులేమంటున్నారు?

Gratitude Boat Rally: కాకినాడలో మత్స్యకారుల బోట్ ర్యాలీ.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments