Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుర వైన్స్ నుంచి -వెన్నెల క‌న్నెల రేయి- పాట‌కు స్పంద‌న‌

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (15:21 IST)
Sunny Naveen, Seema Chaudhary
సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో ఆర్ కె సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండెపు నిర్మాతగా జయ కిషోర్ బండి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం `మధుర వైన్స్`. మంచి చిత్రాలుగా గుర్తింపు పొందిన‌  గతం, తిమ్మరుసు లాంటి  చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ అధినేత సృజన్ యారబోలు ఈ సినిమాకి అసోసియేట్ అవ్వడంతో ఇండస్ట్రీ, ట్రేడ్ లో  ఈ సినిమాపై అంచనాలతో పాటు ఆసక్తి కూడా బాగానే పెరిగింది. ఇప్ప‌టికే ఆడియ‌న్స్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి సంభందించి వెన్నెల క‌న్నెల రేయి అనే సాంగ్ ని విడుద‌ల చేశారు. ఈ సాంగ్ మ‌ద్య‌లో వ‌చ్చే డైలాగ్స్ యూత్ ని ఆక‌ట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఇప్ప‌టికే వైర‌ల్ అవుతున్న ఈ చిత్రాన్ని అతిత్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తు్న్నారు.
 
సృజన్ యారబోలు మాట్లాడుతూ, మా బ్యాన‌ర్ నుంచి త్వ‌ర‌లో `అద్భుతం, పంచతంత్రం` చిత్రాలు కూడా రాబోతున్నాయి. మధుర వైన్స్ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు, సాంగ్స్ ట్రైలర్స్ చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది, ఈ సినిమా ద్వారా చాలా మంచి ప్రేమ ని సిల్వ‌ర్ స్క్రీన్ మీద చూపించ‌బోతున్నాం. హీరొ హీరోయిన్ మద్య‌లో జ‌రిగే స‌న్నివేశాలు యూత్ ని ఆక‌ట్టుకుంటాయి. ఈ సినిమా నుండి ఇప్ప‌డు విడుద‌ల చేసిని సాంగ్ చూస్తే అంద‌రికి అర్ధ‌మ‌వుతుంది, ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో చాలా బాగా వెలుతుంది. ఈ సినిమాకు మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తిక్ కుమార్, జయ్ క్రిష్ సంయుక్తంగా సంగీతం అందించారు.  వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమా విడుద‌ల‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారని అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments