Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈశ్వర్ మృతి పట్ల సినీ ప్ర‌ముఖుల సంతాపం

ఈశ్వర్ మృతి పట్ల సినీ ప్ర‌ముఖుల సంతాపం
, మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (13:43 IST)
Ishwar designs
పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్ సినిమా ప‌రిశ్ర‌మ‌కు అంతులేని అనుబంధం వుంది. మొద‌ట్లో ప‌బ్లిసిటీని పోస్ట‌ర్ ల‌ను సినిమా విడుద‌ల‌ముందు ఆయ‌న డిజైన్ చేస్తేనే కానీ హీరోలుకానీ, స్టూడియో సంస్థ‌లుకానీ ఒక ఐడియాకు వ‌చ్చేవారుకాదు. అప్ప‌ట్లో హీరోల ఫొటోలు తీసి ప‌బ్లిసిటీ చేయ‌డం తెలీదు. కేవ‌లం ప‌బ్లిసిటీ డిజైన్ వేసిన పోస్ట‌ర్ల ఆధారంగానే సినిమా విడుద‌ల‌ను నిర్ణ‌యించేవారు. ఆ ద‌శ‌లో నందమూరి తార‌క రామారావు శ్రీ‌కృష్ణుడు గెట‌ప్, దుర్వోధ‌నుని గెట‌ప్ ఎవ‌ర్‌గ్రీన్‌గా నిలిచాయి. సింహంపై కూర్చుని ఠీవిగా వున్న ఎన్‌.టి.ఆర్‌. ఫొటో ఇప్ప‌టికీ అంద‌రికీ గుర్తిండే వుంటుంది. అలాంటి ఈశ్వ‌ర్‌కు సినీ ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు.

నందమూరి బాలకృష్ణ
పలు చిత్రాలకు తన డిజైన్స్ ద్వారా ప్రచారం కల్పించిన ఈశ్వర్ తిరిగిరాని లోకాలకు వెళ్లడం బాధాకరమని నందమూరి బాలకృష్ణ అన్నారు.‌ ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మంగళవారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా తాను కథానాయకుడిగా నటించిన కొన్ని చిత్రాలకు ఈశ్వర్ పని చేశారని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఈశ్వర్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
 
సురేష్ ప్రొడ‌క్ష‌న్స్.
సీనియర్ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌((84) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో మంగళవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సంద‌ర్భంగా ఆయన మృతి ప‌ట్ల సంతాపం ప్ర‌క‌టించారు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత, ప్ర‌ముఖ నిర్మాత సురేష్‌బాబు. `ఈశ్వర్ గారితో మా సంస్థ‌కి విడ‌దీయ‌లేని అనుబంధం ఉంది.ఈశ్వ‌ర్ గారు మా సంస్థ‌లో అత్య‌ధిక చిత్రాల‌కు ప‌నిచేశారు. నాన్న గారికి ఆయ‌న డిజైన్స్ అంటే ఎంతో ఇష్టం. కేవ‌లం ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌గానే కాకుండా ఎన్నో సినిమాల‌కి క్యారెక్ట‌ర్ పోస్ట‌ర్స్ కూడా డిజైన్ చేశారు. ఈశ్వర్‌గారు ఈ రోజు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం చాలా బాధాక‌రం. ఆయ‌న ప‌విత్ర ఆత్మ‌కు శాంతిచేకూరాల‌ని కోరుకుంటూ వారి కుటుంబ స‌భ్య‌లకు మా ప్ర‌గాడ సానూభూతి తెలుపుతున్నాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొత్తం 119 నీలిచిత్రాలు గుర్తించాం.. రాజ్‌కుంద్రా కేసులో పోలీసులు