Webdunia - Bharat's app for daily news and videos

Install App

షకీలా బయోపిక్‌లో రేష్మ పాత్ర వుంటుందా? ఆమె ఏమైందో చెప్పిన షకీలా...

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (17:32 IST)
మలయాళం సాఫ్ట్ అడల్ట్ స్టార్ చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపిన రేష్మ ఇప్పుడు ఏమైంది, గత 12 ఏళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉండటంతో అభిమానులకు వచ్చిన సందేహం ఇది. ఆమె చనిపోయిందని కొన్నాళ్లపాటు ఉదంతాలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సహ అడల్ట్ స్టార్ షకీలా స్పందించింది. రేష్మ చరిత్రను పరిశీలిస్తే, బెంగుళూరుకు చెందిన రేష్మ సినిమా హీరోయిన్ ఛాన్స్‌ల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు సాఫ్ట్ అడల్ట్ నిర్మాతల కళ్లలో పడింది. 
 
అప్పటి నుండి ఛాన్సులు అందిరావడంతో అడల్ట్ చిత్రాలతో పాపులర్ అయిపోయింది. 90వ దశకంలో షకీలా రాజ్యం ఏలుతున్నప్పుడు ఆమెను వదిలి రేష్మకు అభిమానులుగా మారారంటే ఆమె క్రేజ్‌ని మనం అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో మలయాళం అడల్ట్ చిత్రాల కోసం అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా కూడా రేష్మ పేరు మారుమ్రోగింది. ఆ కాలంలో ఆమె ఒక్కొక్క చిత్రానికి 5 లక్షలు తీసుకున్నట్లు కూడా సమాచారం ఉంది. 
 
మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి పెద్ద హీరోల చలనచిత్రాలకు కూడా పోటీ మారడం ఆమె నైజం. సాంప్రదాయాలపై చెడు ప్రభావం చూపుతున్నాయని ఆ సినిమాలపై కేరళ ప్రభుత్వం నిషేధం విధించింది. దాంతో షకీలా, రేష్మలు కొన్నాళ్లు ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో తెలుగు అడల్ట్ చిత్రాలు షకీలాను ఆదుకున్నాయి. కానీ రేష్మ మాత్రం ఆమెలా స్థిరపడలేకపోయింది. అవకాశాల్లేక వ్యభిచార రొంపిలోకి దిగిపోయింది. బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఆమె కస్టమర్‌లుగా మారిపోయారు. 
 
ఈ క్రమంలో 2007లో రేష్మ వ్యభిచారం కేసులో చిక్కి మరోమారు వార్తల్లోకెక్కింది. బెయిల్‌పై విడుదలైన ఆమె మళ్లీ కనిపించలేదు. దాంతో ఆమెపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. విదేశాలకు వెళ్లి ఉంటుందని కొంత మంది, చనిపోయి ఉంటుందని కొంత మంది భావించారు. తాజాగా షకీలా బయోపిక్ తెరకెక్కుతున్న నేపథ్యంలో ఆ చిత్రంలో రేష్మ పాత్ర కూడా ఉంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై షకీలా స్పందించింది. రేష్మ ఇప్పుడు పెళ్లి చేసుకుని తన భర్తతో మైసూర్‌లో నివసిస్తోందని, ఇద్దరు కుమార్తెలతో సంతోషంగా ఉందని చెప్పింది. ఇప్పుడిప్పుడే ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోతోందని సెలవిచ్చింది. దాంతో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు తెరపడింది. అయితే షకీలా సినిమాలో రేష్మ పాత్ర ఉంటుందా ఉండదా అనేది మాత్రం సస్పెన్స్‌గా నిలిచిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments