Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు పాత్రలో ప్రభుదేవా... సంప్రదిస్తే ఏమన్నాడో తెలుసా?

Advertiesment
Prabhudeva
, శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:19 IST)
ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. వీటిలో సక్సెస్ అయిన వాటి కంటే డిజాస్టర్ అయినవే ఎక్కువగా ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉన్నా కూడా తాజాగా మరో బయోపిక్ రాబోతోంది. చంద్రబాబు బయోపిక్ తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంద్రబాబు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటే పొరపడినట్లే, ఇతను తమిళ నటుడు చంద్రబాబు. ఈయన 1950-60వ దశకాల్లో ప్రముఖ నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రశంసలు పొందిన వ్యక్తి.
 
అప్పట్లో చంద్రబాబు సినిమాలో ఉన్నారంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అనే భావన ఉండేది. తమిళ ప్రముఖ నటుడి శివాజీ గణేశన్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న నటుడిగా గుర్తింపు పొందాడు. ఈయన జీవితం కూడా మహానటి సావిత్రి జీవితానికి దగ్గరగా ఉంటుంది. సినిమాల్లో బాగా పేరు, డబ్బు సంపాదించిన ఈయన చివరి రోజుల్లో ఆస్తులన్నీ పోగొట్టుకుని అప్పుల బారినపడి తాగుడుకు బానిసై అనారోగ్యంతో మరణించాడు. అయితే చంద్రబాబు పాత్రకు ప్రభుదేవాను సంప్రదించినట్లు వినికిడి. దీనికి దర్శకుడిగా రాజేశ్వర్ పని చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాంకర్ శ్రీముఖిని బిత్తిరి అంత మాటన్నాడా..?