Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాక్షి టీవీ మైక్ ఎందుకు పట్టుకున్నానంటే..? రేణూ దేశాయ్

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (19:00 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.. సాక్షి టీవీకి మద్దతు తెలుపుతూ ప్రచారం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ప్రస్తుతం రేణూ స్పందించారు. కర్నూలు జిల్లాలో పవన్ పర్యటించిన అదే సమయంలో రేణూ కూడా ఆ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మైకు పట్టుకుని రైతుల వద్ద ఇంటర్వ్యూ తీసుకున్నారు. 
 
ఈ పర్యటన సందర్భంగా రేణు దేశాయ్ సాక్షి టీవీ రిపోర్టర్ అవతారం ఎత్తడం జనాల్లో పలు అనుమానాలను రేకెత్తించింది. పవన్‌కు వ్యతిరేకంగా రేణును వైసీపీ రంగంలోకి దించిందని జోరుగా ప్రచారం సాగింది.

ఈ వార్తలపై రేణూ దేశాయ్ స్పందిస్తూ.. రైతుల జీవితాలను, వారికష్టనష్టాలను వెలుగులోకి తెచ్చేందుకే సాక్షి మైక్ చేతబట్టానని చెప్పారు. అంతేకానీ ఇందుకు రాజకీయాలకు ముడిపెట్టవద్దని... ఓ టీవీ కార్యక్రమంలో భాగంగా రైతుల కష్టాలను షూట్ చేయాల్సి వచ్చిందని రేణూ దేశాయ్ వెల్లడించారు. 
 
ఇప్పటి వరకు తాను 200 మంది రైతులను కలిశానని, వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయని రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సహకారం అందించేలా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని, తన కార్యక్రమం వల్ల ఒక్క రైతైనే బాగుపడినా సంతోషిస్తానని వెల్లడించారు. రైతుల కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ పని చేశానని.. రైతుల కోసం ఓ సినిమా రాశాను. దానికి అనుగుణంగానే రైతులను కలిశానని రేణు దేశాయ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments