Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనాతో కలిసి పనిచేయడం అసౌకర్యంగా ఫీలవుతున్నా.. పీసీ శ్రీరామ్

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:39 IST)
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్ వివాదాస్పద ప్రముఖ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కనున్న ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ.. 'కంగనా ప్రధాన పాత్రధారిణిగా ఓ ప్రాజెక్టు తెరకెక్కించాల్సివుంది. కానీ, ఆమెతో కలిసి పనిచేయడం అసౌకర్యంగా భావించాను. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలకు చెప్పగా, వారు అంగీకరించారు. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాను. ఆల్ ది బెస్ట్' అంటూ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
పీసీ శ్రీరామ్ ట్వీట్‌కు కంగనా రనౌత్ రీట్వీట్ చేస్తూ.. 'తన గురించి మీకు కలిగిన బాధ లేదా అసౌకర్యం ఏంటో తెలియదు. అయితే, మీరు తీసుకున్న నిర్ణయం సబబే. ధన్యవాదాలు.. ఆల్ ది బెస్ట్' అంటూ పేర్కొన్నారు. 
 
కాగా, కంగనా రనౌత్ ఇపుడు జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెల్సిందే. ముంబైను ఓ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చారు. దీంతో శివసేన పార్టీ నేతలు ఆమెపై కారాలుమిరియాలు నూరుతున్నారు. ఫలితంగా శివసేన - కంగనా రనౌత్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments