Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆప్తమిత్రుడు' కోసం పెన్ను- పేపర్ పడుతానంటున్న 'మాటల మాంత్రికుడు' (Video)

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (09:45 IST)
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మంచి మిత్రులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో 'అజ్ఞాతవాసి' మినహా మిగిలిన రెండు చిత్రాలు (జల్సా, అత్తారింటికి దారేది) సూపర్ డూపర్ హిట్స్ సాధించాయి. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తుందంటే.. పీకే ఫ్యాన్స్ ఆనందానికి అవధులే వుండవు. 
 
ఈ క్రమంలో ఇటీవల 50వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న పవన్ కళ్యాణ్ వరుసగా మూడు ప్రాజెక్టులను ప్రకటించారు. తాజాగా ప‌వ‌న్‌కు సంబంధించిన మ‌రో హాట్ న్యూస్ ఫిల్మ్ న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప‌వ‌న్ కోసం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మ‌రోసారి పెన్ను, పేప‌ర్ పట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 
 
త‌మిళంలో హిట్‌గా నిలిచిన 'అయ్య‌ప్ప‌నుమ్ కొషియ‌మ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జ‌రుగుతున్నాయి. అయితే హీరోల విష‌యంలో సందిగ్ధ‌త నెల‌కొన‌డంతో ప‌వ‌న్ పేరును ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేస్తే బాగుంటుంద‌ని వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది.
 
ఒక‌వేళ ప‌వ‌న్ ఈ చిత్రంలో న‌టించేది క‌న్ఫామ్ అయితే త్రివిక్ర‌మ్ రీమేక్ చిత్రానికి సంభాష‌ణ‌లు రాసేందుకు రెడీగా ఉన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం చేతినిండా స‌మ‌యముండ‌టంతో డైలాగ్స్ రాస్తాన‌ని త్రివిక్ర‌మ్ చెప్పినట్టు సమాచారం. గతంలో కూడా పవన్ నటించిన తీన్మార్ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ అందించిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు... వైద్య కాలేజీకి మృతదేహం దానం

అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?

భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. ట్రంప్‌కు నిక్కీ హేలీ వార్నింగ్

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments