ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును వైఎస్సార్‌గా మార్చుతూ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రకంపనలకు వేదికైంది. ఒక్క టీడీపీ మాత్రమే కాదు ఇతర పార్టీలు, నేతలు సైతం జగన్ నిర్ణయంపై భగ్గుమంటున్నారు. కాగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ అంశంపై స్పందించారు.
ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు.
విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరని ట్వీట్‌లో పేర్కొన్నారు.