Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పేరు మార్చి సాధించేది ఏమిటి? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

Pawan Kalyan
, బుధవారం, 21 సెప్టెంబరు 2022 (18:57 IST)
విజయవాడలోని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పు చేయడం ద్వారా ఏమి సాధించాలనుకొంటున్నారో రాష్ట్ర పాలకులు సహేతుకమైన వివరణ ఇవ్వాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్ఆర్ వైద్య విశ్వవిద్యాలయంగా మార్చారు. 
 
దీనిపై పవన్ కళ్యాణ్ బుధవారం ఒక ప్రకటన చేశారు. ఎన్టీఆర్ బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వైద్య వసతులు మెరుగైపోయాతాయా? అని నిలదీశారు. రాష్ట్రంలో వైద్య వసతులు ప్రమాణాలకు తగ్గ విధంగా లేవు అనేది వాస్తవం. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తగినన్ని పడకలు లేవన్నారు. 
 
సిబ్బంది అందుబాటులో లేరు. ఔషధాలు ఉండవు. కోవిడ్ సమయంలో మాస్కులు అడిగినందుకే డా.సుధాకర్‌ని వేధించడంతో.. మానసిక వ్యధకిలోనై మరణించిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. మెరుగుపరచాల్సిన మౌలిక వసతులను వదిలిపెట్టి విశ్వ విద్యాలయం పేరు మార్చడంలో అర్థం లేదన్నారు. ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకో... కొత్త వివాదాలు సృష్టించేందుకో వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నంలా ఉందన్నారు. 
 
పాలకులు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ వెళ్తే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. పేర్లు మార్చాలి అనుకొన్న పక్షంలో విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా. ఆ పేరు ఇంకా బ్రిటిష్ వాసనలతో ఉంది. స్వాతంత్ర్య అమృతోత్సవాలు చేసుకున్నాం కాబట్టి విశాఖ కేజీహెచ్ పేరు మార్చి వైద్య ప్రముఖులలో ఒకరి పేరు పెట్టండిని అని సూచించారు. 
 
ఈ పాలకులకు యల్లాప్రగడ సుబ్బారావు పేరు తెలుసా? ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞుల్లో ఒకరైన దివంగత యల్లాప్రగడ సుబ్బారావు పేరయినా ఈ పాలకులకు తెలుసా? వైద్య విశ్వ విద్యాలయానికి ఆ రంగంలోని ప్రముఖుల పేరు పెట్టాలనే చిత్తశుద్ధితో కూడిన ఆలోచన ఉండి ఉంటే యల్లాప్రగడ సుబ్బారావు పేరును పరిగణించేవారు. 
 
బోదకాలు, టైఫాయిడ్‌లాంటి రోగాలకు మందులు కనుగొని ప్రపంచానికి అందించిన గొప్ప శాస్త్రవేత్త, మన తెలుగు వారైన యల్లాప్రగడ సుబ్బారావు పేరుని కనీసం ఒక్క సంస్థకైనా ఈ పాలకులుపెట్టారా? ఇంట్లో వాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకుపెట్టే ముందు ప్రజల కోసం జీవితాలను ధారపోసిన మహనీయుల గురించి పాలకులు తెలుసుకోవాలి అని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

PM యసస్వి స్కాలర్‌షిప్ 2022: సెప్టెంబర్ 25న పరీక్ష