Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో ఇంటిని సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు... హైకోర్టు మెట్లక్కిన ప్రభాస్

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (16:28 IST)
టాలీవుడ్ హీరో ప్రభాస్ ఇంటిని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పైగాలోని వివాదాస్పద స్థలంలోని అర ఎకరంలో ప్రభాస్ ఓ గెస్ట్‌హౌస్‌ను నిర్మించుకున్నారు. ఈ ఇల్లు ఉన్న స్థలం వివాదం గత 20 యేళ్లుగా రాయదుర్గం కోర్టులో సాగుతోంది. దీంతో రెండు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. అంతేకాకుండా, సర్వే నంబర్ 46లోగల రూ.1700 కోట్ల విలువ చేసే 84.30 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
అయితే తనకు నోటీసులివ్వకుండానే గెస్ట్‌హౌస్‌ను అధికారులు సీజ్‌ చేశారని ప్ర‌భాస్ పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించింది. అయితే, రాయదుర్గంలోని పాన్ మక్తా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో ఈ కేసును కూడా పాత కేసు నడుస్తున్న డివిజన్ బెంచ్‌కే బదిలీ చేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఫలితంగా మరో బెంచ్‌కు బదిలీ చేసింది. దీంతో దీనిపై పూర్తిస్థాయి విచారణ గురువారం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments