Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్ర‌భాస్ సాహో రిలీజ్ డేట్ ఫిక్స్..!

Advertiesment
ప్ర‌భాస్ సాహో రిలీజ్ డేట్ ఫిక్స్..!
, మంగళవారం, 18 డిశెంబరు 2018 (10:11 IST)
బాహుబ‌లి సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ప్ర‌భాస్‌కి అభిమాన గ‌ణం ఏ రేంజ్‌లో ఉన్నారో ప్రత్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. బాహుబ‌లి సినిమా చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కులు ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రం గురించి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ సాహో అనే సినిమా చేస్తున్నాడు. ఈ భారీ చిత్రాన్ని యు.వి. క్రియేష‌న్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ మూవీలో ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధా క‌పూర్ న‌టిస్తోంది.
 
హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌తో ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో, నీల్ నితిన్ ముఖేష్ .. అరుణ్ విజయ్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోకు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఈ సినిమాపై అప్ప‌టివ‌ర‌కు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయ‌ని చెప్ప‌చ్చు. ఈ మూవీని ఆగ‌ష్టు 15న ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. ఆ రోజు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పండ‌గే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విన‌య విధేయ రామ సెకండ్ సింగిల్ అదిరింది..!