Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాల్తేరు వీరయ్యతో మాస్ సాంగ్‌లో కలసి సందడి చేయనున్న రవితేజ

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (16:31 IST)
Waltheru Veeraya
మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ 'వాల్తేర్ వీరయ్య'. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్స్‌ ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిరంజీవి, రవితేజలపై మాస్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు.
 
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. చిరంజీవి, రవితేజ గ్రేస్ ఫుల్ మూవ్స్, ఎనర్జీతో అలరించేలా మాస్ డ్యాన్స్ నంబర్‌ ను ట్యూన్ చేశారు. శేఖర్ మాస్టర్ అద్భుతంగా ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. చిరంజీవి, రవితేజ ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లు, భారీ సెట్‌ లో చిత్రీకరించిన మాస్ నంబర్ లో వీరిద్దరినీ చూడటం అభిమానులకు కన్నుల పండగ కానుంది. మెగా మాస్ విందును బిగ్  స్క్రీన్‌ లపై చూసేందుకు అభిమానులు, సినీ ప్రేమికులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
 
చిరంజీవి వింటేజ్ అవతార్‌ లో కనిపించిన ఈ సినిమా టైటిల్ టీజర్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్, గెటప్, మ్యానరిజమ్స్ అందరికి పూనకాలు తెప్పించింది.
 
అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.
 
నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.
వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సైబర్ క్రైమ్: వాట్సాప్ పోస్టులు ఫార్వర్డ్ చేసినా నేరమేనా, ఎలాంటి పోస్టులు నేరమవుతాయి?

అప్రమత్తంగా ఉండండి: సహజ వాయువు పైప్‌లైన్‌ల తవ్వకం, నాశనం చేస్తే చట్టపరమైన చర్యలు

దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు.. ఎందుకంటే.. పవన్‌పై అలా?

కారం, పసుపు ఎక్కువగా తింటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

DCM రక్షణ బిల్లు ఎవరికోసం.. ఆ భాష ఏంటండీ బాబూ.. చదవలేకపోతున్నాను.. శ్యామల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments