Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్ మహారాజా వారసుడు ఇప్పుడే సినిమాల్లోకి రాడట?

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (10:32 IST)
Raviteja_Son
ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ మామూలే.  ఎంతమంది ఎంతగా నెపోటిజంపై ఎన్ని ఆరోపణలు చేసినా వచ్చే వారు వస్తూనేఉన్నారు..వెళ్లేవారు వెళుతూనే ఉన్నారు. ఈ వారసుల పరంపర కొనసాగడం మాత్రం ఆగడంలేదు. మెగాస్టార్ చిరంజీవికి తర్వాత ఆ కుటుంబం నుంచి దాదాపు 10 మంది హీరోలు వచ్చారు. నిన్నగాక మొన్నొచ్చిన విజయ్ దేవరకొండ కూడా తన స్టామినాతో తమ్ముడు ఆనంద్‌ను పరిచయం చేశాడు. 
 
మొన్న మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ ఆయన హిట్ కూడా కొట్టాడు. తాజాగా రవితేజ సైతం నేడు కాకపోతే రేపు తన వారసుడిని పరిచయం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే రాజా ది గ్రేట్‌లో రవితేజ తనయుడు మహాధన్ నటించాడు. అందులో చిన్నప్పటి రవితేజగా కనిపించాడు. ఈ సినిమా తర్వాత రవితేజ తనయుడికి మరిన్ని ఆఫర్స్ కూడా వచ్చాయి. అయితే రవితేజ మాత్రం తన కొడుకును ఇప్పుడే సినిమాలకు పరిమితం చేయడం ఇష్టం లేదు. చదువులు పూర్తయ్యాకే తనయుడిని సినిమాల్లోకి తేవాలని మాస్ మహారాజా అనుకుంటున్నాడు. 
 
ప్రస్తుతం తన కొడుకు 9వ తరగతి చదువుతున్నాడని.. వాడికి చదువు తప్ప మరో ధ్యాస లేదని చెప్పాడు రవితేజ. రాజా ది గ్రేట్ లో కూడా అనిల్ రావిపూడి బలవంతం చేస్తే ఒప్పుకున్నాను కానీ ఇప్పట్లో చదువు వదిలేసి మరి సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments