వేసవికి వస్తోన్న వకీల్ సాబ్.. ఫైట్ సీన్ లీక్.. సంక్రాతికి టీజర్ వచ్చేస్తుందా?

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (10:25 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో శృతిహాసన్‌, అంజలి, నివేథా థామస్‌, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 
 
అయితే.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టీజర్‌ వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు ప్రముఖ నటుడు దేవ్‌గిల్‌ సర్‌ఫ్రైజ్‌ ఇచ్చాడు. ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌కు సంబంధించిన ఫొటోని తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇది కొద్ది నిమిషాల్లోనే వైరల్‌ అయింది. 
 
ఈ స్టిల్స్‌ను బట్టి చూస్తే... సినిమాలో చాలా మార్పులు చేశారని అర్ధమవుతుంది. కాగా..ఈ ఏడాది ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ట్యాగ్స్ లలో 'వకీల్ సాబ్' కూడా నిలిచింది అంటే హవా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీలైనంత వరకు టీజర్‌లో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నారని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డాబా మీద తల్లి.. ఇద్దరు పిల్లలు.. గోడమీద నుంచి తొంగి చూసిన చిరుత.. ఆ తర్వాత? (video)

దృశ్యం సినిమా చూసి భార్య హత్యకు ప్లాన్ చేసిన భర్త... ఏమీ తెలియనట్టుగా పోలీసులకు ఫిర్యాదు...

Red Fort blast: ఢిల్లీలో కారు పేలుడు.. ఎలాంటి పుకార్లను పట్టించుకోవద్దు.. అలెర్ట్

అద్దెకొచ్చిన మహిళతో అక్రమ సంబంధం... పెళ్లికి ఒత్తిడి చేయడంతో చంపేసిన యజమాని...

దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ 2025: 30 రోజుల పాటు కదలడానికి, కనెక్ట్ అవ్వడానికి ప్రపంచవ్యాప్త ఆహ్వానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

తర్వాతి కథనం
Show comments