Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారెన్స్ బ్రదర్‌తో ప్రాణహాని.. బ్రోతల్ కేసులో ఇరికించారంటూ నటి దివ్య ఆవేదన

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (09:34 IST)
సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్, నిర్మాత రాఘవ లారెన్స్‌ సోదరుడు ఎల్విన్‌పై తమిళ వర్థమాన నటి దివ్య సంచలన ఆరోపణలు చేసింది. ఎల్విన్ వల్ల తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించింది. 
 
పోలీసులతో కుమ్మక్కై తనను అంతమొందించాలని చూస్తున్నారని ఫిర్యాదుతో పేర్కొంది. హైదరాబాద్ పోలీసు అధికారి రవీందర్ రెడ్డితో ప్రత్యేక నెట్‌వర్క్ పెట్టుకుని... తనను వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 
 
గతంలోనే ఈ వ్యవహారాన్ని తెచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను ఆశ్రయించినా ఫలితం లేదని దివ్య తెలిపింది.
 
కాగా.. గతంలో ఏం జరిగిందంటే సినీ కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్‌ తమ్ముడు ఎల్విన్‌ అలియాస్‌ వినోద్‌, ఏసీపీ రవీందర్‌రెడ్డి తన జీవితాన్ని నాశనం చేశారని తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్సర్‌గా, జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తున్న దివ్య ఆరోపించింది. 
 
ప్రేమ పేరుతో ఎల్విన్‌ వేధింపులకు గురిచేస్తే.. తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సింది పోయి నాటి మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌, ప్రస్తుత ఏసీపీ రవీందర్‌ రెడ్డి, ఎల్విన్‌తో కలిసి ఆరేళ్లుగా తనను వేధిస్తున్నాడని వాపోయింది. 
 
తనను బ్రోతల్‌ కేసులో ఇరికించి 21 రోజులు జైల్లో ఉండేలా చేశారని కన్నీరు పెట్టుకుంది. ఎల్విన్‌, రవీందర్‌రెడ్డి నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది. సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం పంపినట్లు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments