ఒక వ్యక్తి.. ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబం.. బావుంటే అందరూ బావుంటారా? కొన్ని కోట్లాది కుటుంబాల కలయిక వల్ల ఏర్పడిన ఈ సమాజం ఎలా ఉండాలి? ఎలా ఉంటే బావుంటుంది? మన భావితరాలకు మంచి సమాజాన్ని మనం ఇస్తున్నామా? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలు. ఈ ఆలోచనల సమాహారంగా రూపొందిన నవల అద్భుతం.
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ నవలను ఆవిష్కరించారు. దిల్ రాజుగారి నిర్మాణంలోని రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో రైటర్‌గానూ, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన ఈ నవలను రచించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన దిల్‌రాజు రైటర్ వసంత కిరణ్‌ను అభినందించారు.
ఈ సందర్భంగా.. రైటర్ వసంత కిరణ్ మాట్లాడుతూ, నవలను ఆవిష్కరించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారికి థాంక్స్. సినిమాగా చిత్రీకరించాలని పక్కా స్క్రీన్‌ప్లేతో రాసుకున్న కథ ఇది. సినిమాగా రూపకల్పన జరగడం కంటే ముందు పుస్తకం రూపంలో మన ముందుకు వస్తుంది.
ఈ కథను పుస్తక రూపంలో తీసుకు వస్తే బావుంటుందని సూచించి టైటిల్‌ను సూచించిన నా మిత్రుడు, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ సత్య కాశీ భార్గవకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే నా ప్రయాణంలో నా వెన్నంట ఉండి ఎంకరేజ్ చేసిన మిత్రులు హరి, తిరుపతిలకు కృతజ్ఞతలు. త్వరలోనే ఈ నవలను సినిమా రూపంలో తెరకెక్కనుంది. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాం అన్నారు.