Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ రావణాసుర టీజర్ రాబోతుంది

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (17:04 IST)
Raviteja new look
రవితేజ క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ “రావణాసుర” లో కనిపించనున్నాడు. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
పర్ఫెక్ట్ ప్లానింగ్ తో డైరెక్టర్ సుధీర్ వర్మ షూటింగ్ పార్ట్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. టీజర్ ను మార్చి 6వ తేదీన ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రవితేజ ట్రెండీగా, క్రూయల్ లుక్ లో కనిపిస్తున్న ఇంటెన్స్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ అనౌన్సుమెంట్ చేశారు.
 
భారీ నిర్మాణ విలువలతో రావణాసుర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నుండి వచ్చిన రెండు పాటలు టెర్రిఫిక్ రెస్పాన్స్ తో మిలియన్స్ వ్యూస్ సాధించి ట్రెండింగ్ లో ఉన్నాయి.
 
శ్రీకాంత్ విస్సా యూనిక్ కథని అందించారు, సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్ తో కథనంలో కొన్ని ఊహించని మలుపు లతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు.
 
సమ్మర్ లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్ లో ఒకటైన ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమవుతోంది.
 
తారాగణం: రవితేజ, సుశాంత్, శ్రీరామ్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

బండరాళ్లు మీదపడి ఆరుగురు కూలీలు దుర్మరణం - సీఎం బాబు దిగ్భ్రాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments