రవితేజ నటిస్తోన్న `రామారావు ఆన్ డ్యూటీ` సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఫైనల్ షెడ్యూల్ ప్రారంభించేందుకు టీం రెడీగా ఉంది.
ఈ ఫైనల్ షెడ్యూల్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించనున్నారు. భారతదేశంలోని కొన్ని లొకేషన్లలో ఈ సీన్స్‌ను షూట్ చేయనున్నారు. యూరోప్‌లోని అందమైన లొకేషన్లలో పాటలను తెరకెక్కించనున్నారు. భారతదేశంలోని దట్టమైన అడవుల్లో ఈ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. రవితేజ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోన్నారు.
సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.