Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

దేవీ
సోమవారం, 16 జూన్ 2025 (18:15 IST)
Mass maha raj Ravi Teja
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన కొత్త చిత్రం #RT76 తో మరోసారి తన సిగ్నేచర్ ఎనర్జీతో అలరించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవల పూజా వేడుకతో ప్రారంభమైయింది. ప్రేక్షకులను ఆకట్టుకునే హై ప్రొడక్షన్ వాల్యూస్ తో చిత్రాలను అందించే SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న #RT76 హ్యుమర్, ఎమోషన్స్ తో కూడిన హోల్సమ్ ఎంటర్ టైనర్ గా వుండబోతోంది.
 
ఈ చిత్రం ఈరోజు అఫీషియల్ గా సెట్స్ పైకి వెళ్ళింది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. రవితేజ, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
 
దర్శకుడు కిషోర్ తిరుమల, రవితేజ ట్రేడ్‌మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్‌తో కూడిన ఫుల్ లెంత్ ఫ్యామిలీ డ్రామాని రాశారు. రవితేజ ఈ సినిమా కోసం చాలా స్టైలిష్ గా మేకోవర్ అయ్యారు.  
 
టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. ధమాకా చిత్రానికి బ్లాక్‌బస్టర్ సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో మరో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కోసం రవితేజతో కలిసి పని చేస్తున్నారు. ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.
 #RT76 2026 సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments