Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌వితేజ ఖిలాడి టాకీ పార్ట్ పూర్తి

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (17:25 IST)
Raviteja, dimpul
మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ `ఖిలాడి`.  సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి, వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది.
 
థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌ ఇచ్చేందుకు రమేష్ వర్మ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్,  జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా..అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
సాంకేతిక బృందం: కథ, కథనం, దర్శకత్వం: రమేష్ వర్మ, నిర్మాత: సత్యనారాయణ కోనేరు, సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గద, సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్,  సినిమాటోగ్రఫర్: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు,  స్క్రిప్ట్ కో ఆర్టినేషన్: పాత్రికేయ, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు అరివు,  డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, సాగర్,  ఎడిటర్: అమర్ రెడ్డి, లిరిక్స్: శ్రీ మణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments