Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో పాట చిత్రీక‌ర‌ణలో ర‌వితేజ - ఖిలాడి

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (15:47 IST)
Ravi Teja, Meenakshi Chaudhary, Dimple Hayati
రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
ప్రస్తుతం చిత్రయూనిట్ దుబాయ్‌లో ఉంది. రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలపై అంద‌మైన‌ పాటను చిత్రీకరించనున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వ‌ర‌ప‌రిచిన ట్యూన్‌కు యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోతోన్నారు. శుక్ర‌వారంనాడు పాట చిత్రీక‌ర‌ణ‌  ప్రారంభమైంది. దుబాయ్‌తో పాటు మస్కట్‌లోని కొన్ని ప్రదేశాల్లో ఈ పాటను చిత్రీకరించనున్నారు.
 
రవితేజ, డింపుల్ హయతి న‌టించిన‌ ఇష్టం అనే పాటను వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆ మెలోడీ ట్యూన్ అందరినీ ఆకట్టుకుంది. యశ్ మాస్టర్ ఆ పాటకు అందంగా కొరియోగ్రఫీ చేశారు.
 
థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసేందుకు దర్శకుడు రమేష్ వర్మ అద్భుత‌మైన క‌థ‌ను రెడీ చేశారు. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంతో అల‌రించ‌నున్నారు.
 
ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
సాంకేతిక బృందంః కథ, కథనం, దర్శకత్వం: రమేష్ వర్మ,  నిర్మాత: సత్యనారాయణ కోనేరు, సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గద, సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్,  సినిమాటోగ్రఫర్: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు,  స్క్రిప్ట్ కో ఆర్టినేషన్: పాత్రికేయ, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు అరివు,  డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, సాగర్,  ఎడిటర్: అమర్ రెడ్డి, లిరిక్స్: శ్రీ మణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments