Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణాసుర భారీ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (19:14 IST)
Ravanasur location
మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  `రావణాసుర` చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ షెడ్యుల్ లో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమాలో ఇది కీలకమైన షెడ్యూల్. దీంతో చిత్రీకరణకు సంబధించి మూడు షెడ్యూల్లా షూటింగ్ పూర్తయింది.
 
అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. రవితేజ లాయర్ గా కనిపించబోతున్న ఈ చిత్రంలో సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన వీరిద్దరి ఫస్ట్ లుక్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  
 
ఈ చిత్రంలో  ఐదుగురు హీరోయిన్లకు ప్రాధాన్యత వుంది. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి పవర్ ఫుల్ కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. దర్శకుడు సుధీర్ వర్మ , మాస్ మహారాజా రవితేజని ఈ చిత్రంలో సరికొత్తగా చూపించబోతున్నారు.
 
ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ ద్వయం సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్‌గా, శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments