Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాట సాంగ్ మినహా షూటింగ్ పూర్తి

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (19:00 IST)
Mahesh new look
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ భారీ చిత్రానికి సంబధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులని అలరిస్తుంది. సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా రికార్డులు సృష్టించాయి.
 
ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కు సన్నాహాలు చేస్తుంది. మిలిగిన ఒక పాటను త్వరలోనే చిత్రీకరించనున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్న ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజులు వుండటంతో చిత్ర యూనిట్ రెగ్యులర్ అప్డేట్స్ తో ముందుకొస్తున్నారు.
 
మొదటి పాటగా విడుదలైన 'కళావతి' మళ్ళీ మళ్ళీ పాడుకునే పాటగా నిలిచి రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకొని మ్యూజికల్ ప్రమోషన్స్ కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా, సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె ప్రిన్సెస్ సితార ఘట్టమనేని ఫస్ట్ అప్పియరెన్స్ తో వచ్చిన రెండో పాట 'పెన్ని' సాంగ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సితార క్యూట్ అండ్ ట్రెండీ డ్యాన్స్ లతో ప్రేక్షకులని మెస్మైరైజ్ చేసింది. సితార అప్పియరెన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది.
కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

ఉత్తర ద్వారం నుంచే విష్ణుమూర్తిని చూడాలా, ద్వారాలు బద్ధలవ్వాలా?: భక్తులకు సూటిగా గరికపాటి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments