హల్లో రైల్వే మంత్రిజీ.. నా బ్యాగును ఎలుక కొరికింది.. రైలు ప్రయాణం చేదు అనుభవమేనా? : మరాఠీ నటి ట్వీట్

భారతీయ రైల్వే బోగీల్లో ఎలుకలు వికటాట్టహాసం చేస్తున్నట్టు మరోమారు నిరూపితమైంది. రైల్వే శాఖ అనుబంధ సంస్థ అందించే ఆహారంలో బొద్దింకలు, ఇతర పురుగులు కనిపిస్తున్నాయి. రైలు బోగీల్లో ఎలుకలు ఇష్టానుసారంగా తిరు

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (16:02 IST)
భారతీయ రైల్వే బోగీల్లో ఎలుకలు వికటాట్టహాసం చేస్తున్నట్టు మరోమారు నిరూపితమైంది. రైల్వే శాఖ అనుబంధ సంస్థ అందించే ఆహారంలో బొద్దింకలు, ఇతర పురుగులు కనిపిస్తున్నాయి. రైలు బోగీల్లో ఎలుకలు ఇష్టానుసారంగా తిరుగుతున్నాయి. ఈ విషయం మరోమారు నిరూపితమైంది. ఇదే విషయంపై మరాఠీ నటి ఒకరు రైల్ మంత్రికి ఓ ట్వీట్ చేశారు. అలాగే, ఎలుక కొరికిన ఫోటోను కూడా ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈనెల‌ 22న లాతూర్ ఎక్స్ప్రెస్‌లో ఏసీ బోగీలో మరాఠి నటి నివేదిత సరాఫ్ ప్రయాణించింది. రైలులో తాను నిద్ర‌పోతున్న స‌మ‌యంలో త‌న బ్యాగును తల పక్కన పెట్టుకుని నిద్రపోయింది. మేల్కొన్న త‌ర్వాత బ్యాగుని చూస్తే దాన్ని ఎలుక కొరికేసివుంది. దీంతో ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ఫిర్యాదు చేశారు. రైలు ప్రయాణం చేయ‌డం తనకు చేదు అనుభవంగా మిగిలింద‌ని వ్యాఖ్యానించారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆమె ఎలుక కొరికిన బ్యాగు ఫొటోను కూడా ట్విట్ట‌ర్‌లో పెట్టింది. న‌టి చేసిన‌ ట్వీట్ ఫిర్యాదుపై స్పందించిన‌ సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ రైళ్ల‌లో తిరిగే ఎలుకలను పట్టుకోవడం కోసం ఏర్పాటు చేసిన‌ సిబ్బంది ఎప్పటికప్పుడు వాటిని అరికడతారని చెప్పగా, మ‌రో అధికారి స్పందిస్తూ రైలు ప్రయాణికులు చేస్తున్న‌ ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నామని తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటిన 8నెలల గర్భవతి.. భారతీయ మహిళ మృతి

శబరిమలలో భారీ రద్దీ.. స్పృహ కోల్పోయి మృతి చెందిన మహిళా భక్తురాలు

నవంబర్ 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూపు-2 పరీక్ష రద్దు : తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments