Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

దేవీ
బుధవారం, 11 జూన్ 2025 (16:18 IST)
Pee Pee Dum Dum song dance Rashmika Mandanna
ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల 'కుబేర' సినిమా ప్రమోషన్స్ పాన్-ఇండియా స్థాయిలో జరుగుతున్నాయి. మూవీ టీం వివిధ నగరాల్లో పర్యటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా, ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ పీ పీ డుమ్ డుమ్ నిన్న ముంబైలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ట్రాక్‌ను ఈరోజు అఫీషియల్ గా పబ్లిక్ కి రిలీజ్ చేశారు.
 
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పెప్పీ బీట్స్ తో ఈ  ట్రాక్‌ను అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ కంపోజిషన్ సింగిల్ లైఫ్ ని ప్రజెంట్ చేస్తోంది. ఈ పాట రష్మిక మందన్న పాత్ర చుట్టూ చిత్రీకరించారు. ఆమె గర్ల్స్ హాస్టల్‌లో తన గ్యాంగ్‌తో కలిసి ‘సింగిల్‌గా ఉండటమే హాయిగా జీవించడానికే మార్గం’ అనే సందేశాన్ని చెప్పడం అలరించింది.
 
చైతన్య పింగళి రాసిన సాహిత్యం అద్భుతంగా వుంది. ఇంద్రావతి చౌహాన్ తన వాయిస్‌తో పాటకు జీవం పోసింది. రష్మిక తన పాత్రలో ఒదిగిపోయింది. పెళ్లికి ఒత్తిడి చేసేవారి మాటలతో ప్రభావితం కాకుండా ఉండే ప్రతి అమ్మాయి స్ఫూర్తిని ప్రజెంట్ చేసింది.
 
కుబేర లో ప్రతి పాట డిఫరెంట్ గా ఉంటూ కథ నేపధ్యాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సూపర్ హిట్ ఆల్బం అందించారు. ఈ చిత్రానికి తగిన భావోద్వేగాలు, జోనర్‌కు తగ్గట్టు పాటలు రూపొందించి, కథను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లేలా చేశారు.
 
ఈ చిత్రంలో జిమ్ సర్బ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP,అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలోకి వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments