Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ డైరెక్టర్‌కి షాకిచ్చిన రష్మిక మందన్న!

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (11:27 IST)
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఒక సామెత ఉంది... పాపం రష్మికకు అది తెలుసో తెలియదో కానీ అగ్ర దర్శకులు చేసే ఆఫర్లను కూడా తిరస్కరించేయడం చూస్తూంటే... అటువంటి సామెత కన్నడంలో ఉన్నట్లు లేదేమో మరి... అనిపిస్తోంది.
 
వివరాలలోకి వెళ్తే... ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన కన్నడ భామ రష్మిక మందన్న... తన మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను బుట్టలో వేసేసుకున్న ఈ భామ.. ఆ తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా సాధించిన విజయంతో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని కూడా కొట్టేసింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా సినీ పరిశ్రమలో మారుమోగిపోవడమే కాకుండా అవకాశాలు కూడా క్యూకట్టేసాయి. ఈ నేపథ్యంలో ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్ బడా దర్శకుల చూపు కూడా రష్మికపై పడింది.
 
వివరాలలోకి వెళ్తే... బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తాను రూపొందించబోయే కొత్త సినిమాలో ఇటీవలి కాలంలో రష్మికకి ఓ పాత్రని ఆఫర్ చేస్తూ సంప్రదించడం జరిగిందట. భన్సాలీ తెరకెక్కించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడాతో నటించనున్నారట. అయితే ఈ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువగా ఉందనే కారణం చూపుతూ రష్మిక ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. ఈ వార్త కాస్తా బయటకు రావడంతో... రష్మికకు భలే డిమాండ్ ఉందే! అనే టాక్ సినీ వర్గాలలో మొదలైపోయింది. మరి ఇలా చేతికి అందివచ్చిన అవకాశాలను కూడా వదిలేసుకోవడం మంచిదో కాదో కానీ ఆవిడకి అనుభవమే నేర్పవలసి ఉంది కదా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్లైట్ ల్యాండ్ కాగానే చెలరేగిన మంటలు.. విమానం రెక్కలపై ప్రయాణికుల ఆర్తనాదాలు..

ఏప్రిల్ 15 - 20 మధ్య ప్రధాని నరేంద్ర మోడీ రాక!!

Mangaluru: రోడ్డుపై నడుస్తూ వెళ్లిన మహిళను ఢీకొన్న కారు.. తలకిందులుగా వేలాడుతూ.. (video)

పోక్సో కేసులో మాజీ ముఖ్యమంత్రి యడ్డీకి బిగ్ రిలీఫ్!

బంగారు నగలు తుప్పుపట్టిపోతున్నాయ్ ... ప్లీజ్ మాకిచ్చేయండి...: గాలి జనార్థన్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments