Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుబేర నుంచి రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్

డీవీ
శుక్రవారం, 5 జులై 2024 (19:04 IST)
Kubera-rashmika
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ శేఖర్ కమ్ముల మోస్ట్ ఎవైటెడ్ మైథలాజికల్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర' ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా వుంది. మేకర్స్ ఇప్పటికే ఈ ఇద్దరి సూపర్‌స్టార్‌ల క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ లకు ట్రెమండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తోంది.
 
ఈరోజు మేకర్స్ రష్మిక ఫస్ట్ లుక్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ని రివీల్ చేసారు. ఆమె ఎక్స్ ట్రార్డినరీ, డిఫరెంట్ అవతార్‌లో కనిపించి ప్రేక్షకులలో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ లుక్ థ్రిల్లింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
 
ఆకట్టుకునే విజువల్స్‌తో, శేఖర్ కమ్ముల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషల్ డ్రామాలో డిఫరెంట్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. గ్లింప్స్ వీడియోలో డబ్బుని తవ్వి తీసున్న రష్మిక క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసి క్యురియాసిటీని పెంచారు.  దేవి శ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ కట్టిపడేసింది.
 
శేఖర్ కమ్ముల కుబేర నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ కాస్ట్ తో  రూపొందుతున్నమోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ చిత్రాలలో ఒకటి. జిమ్ సర్భ్ మరో ప్రముఖ పాత్రలో కనిపించనున్న ఈ హై-బడ్జెట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.
 
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుబేర  పాన్-ఇండియా మల్టీ లాంగ్వేజ్ మూవీ. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు
 ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీచ్ రిసార్ట్‌ విహారయాత్ర... స్విమ్మింగ్ పూల్‌లో మునిగి మహిళలు మృతి (video)

పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని.. 18మంది విద్యార్థినులకు హెయిర్ కట్ (video)

దుఃఖ సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : నారా రోహిత్

మంగళగిరిలో లేడీ అగోరి హల్చల్‌- పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు రోడ్డుపైనే..? (Video)

టీ అడిగితే లేదంటావా.. బేకరీలో మందుబాబుల ఓవరాక్షన్.. పిచ్చకొట్టుడు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments