Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను రష్మికనే పెళ్లి చేసుకుంటా.. నాకు సిగ్గు బాబోయ్ అంటున్న రష్మిక..

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:02 IST)
గీతా గోవిందం చిత్రంలో రష్మిక ఎలా నటించారనే విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటన చాలా బాగుంది. అంతేకాదు.. ఈ సినిమాలోని ఒక్క సాంగ్‌తోనే అందరి మన్ననలను పొందారు రష్మిక. అదేనండి.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే సాంగ్. ఇప్పుడు ఈ సాంగ్ ఎక్కడ విన్నా కూడా రష్మికనే గుర్తుకు వస్తుంది. ఈ సాంగ్ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ.. ఆమె మొదటి సీన్‌‌ను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. దానికి తోడుగా స్త్రీలు ఆ సీన్‌ చూసి.. రష్మిక అందులో ఎలా చేస్తుందో.. అలా చేస్తూ.. డబ్‌స్మాష్ చేస్తూ సోషియల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
 
ఇదిలా ఉండగా.. ఓ 4 ఏళ్ల అబ్బాయి రష్మికా మందన కావాలంటున్నాడు. పోనీ ఏదో ఫోటో దిగడానికి అనుకుంటే.. ఏకంగా పెళ్లి చేసుకుంటాడట. నీ కన్నా పెద్దది కదా.. అని అడిగితే... అదేం తెలియదు నాకు రష్మిక కావాలంటున్నారు. ఈ విషయం రష్మికకు తెలిసిపోయింది.. ఈ బుల్లి పెళ్లి కొడుకుని చూసి సిగ్గుపడిపోతూ.. నాకు సిగ్గు బాబు అనేసింది.
 
ప్రవీణ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈ బుల్లి పెళ్లి కొడుకుని వీడియో తీశాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ బుడ్డోడి పేరు ప్రతి. ఈ బుడ్డోన్ని ఎవర్ని పెళ్లి చేసుకుంటావ్ అని అడిగితే నేను రష్మికనే చేసుకుంటానని చెప్పేశాడు. ఇంతకీ రష్మిక ఎవరు అని అడిగితే.. అదంతా నాకు తెలియదు.. హీరోయిన్.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే సాంగ్‌లో వస్తుంది కదా ఆ అమ్మాయే అంటున్నాడు.
 
రష్మిక నీకంటే పెద్దది కదరా అంటే.. పోనీ సమంతాని చేసుకుంటూ అన్నాడు. సమంతకి పెళ్లైపోయింది బుజ్జీ అంటే.. అయితే రష్మికనే చేసుకుంటా.. ఆమె తప్ప నాకు ఎవరూ వద్దూ.. మీరెవరైనా రష్మికను చేసుకుంటానంటే.. కొట్టేస్తా అంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharshtra: ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. జ్యూస్ ఇచ్చి ఫ్లాటులో?

మాకు నీటిని ఆపితే.... మేము మీ శ్వాసను ఆపేస్తాం : భారత్‌కు పాకిస్థాన్ హెచ్చరిక

భీమవరం బుల్లోడు బ్రిటన్ ఉప మేయర్ అయ్యాడు.. ఎలా?

అతివేగంగా చెట్టును ఢీకొట్టిన కారు రెండు ముక్కలైంది: ముగ్గురు మృతి

ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు... క్రమంగా పెరుగుతున్న కేసులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments