Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీలియోన్.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుందట.. 98.5 మార్కులట.. నిజమేనా?

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (14:36 IST)
పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన సన్నీలియోన్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఉత్తరాదిన సినిమాలు చేస్తూ.. దక్షిణాదిన ఐటమ్ గర్ల్‌గా మంచి మార్కులేసుకున్న సన్నీలియోన్.. ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వీరమహాదేవి సినిమాలో నటిస్తోంది. 
 
ఇలా సినిమాల్లో నటిస్తూ భారీగా డబ్బులు సంపాదించుకుంటున్న సన్నీలియోన్.. తాజాగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కోసం ప్రయత్నిస్తోందట. నోటిఫికేషన్ జాబితాలో ఆమె పేరు కనబడింది. ఇంకా సన్నీలియోన్ 98.5 అత్యధిక మార్కులు కొట్టేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇక్కడ సన్నీ లియోని అంటే నటి కాదని, బీహార్‌కు చెందిన ఓ విద్యార్థిని అని కొందరు అంటున్నారు. ఇటీవల బిహార్‌ పబ్లిక్‌ హెల్త్‌‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్ ‌(పీహెచ్‌ఈడీ) జూనియర్‌ ఇంజినీర్ ‌(సివిల్‌) పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. జనవరి 15 నుంచి 31 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. 
 
ఇందులో మెరిట్‌ లిస్ట్‌ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో టాపర్‌గా సన్నీలియోని పేరు ఉంది. మెరిట్‌ జాబితా ప్రకారం సన్నీలియోని 98.5శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దీనిపై పీహెచ్‌ఈడీ జాయింట్‌ సెక్రటరీ అశోక్‌ కుమార్‌ స్పందించారు. ఈ మార్కులు బీహార్‌కు చెందిన విద్యార్థినివా.. లేకుంటే సన్నీలియోన్‌దేనా అనేది ఇప్పటికే చెప్పలేమన్నారు. సర్టిఫికేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తర్వాత మాత్రమే ఇది నిజమా కాదా అనేది చెప్పగలమని అశోక్ కుమార్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదా? కేంద్ర మంత్రి ఫైర్

ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన విమానం... గగనతలంలో ప్రయాణికుడు మృతి!!

దేవాన్ష్ పుట్టిన రోజు - తిరుమల అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు

కాడాబాంబ్ ఒకామి- అరుదైన వోల్ఫ్ డాగ్.. రూ.50 కోట్లు ఖర్చు చేసిన సతీష్.. ఎవరు?

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం