Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గీత గోవిందం' సెట్‌లో ఏడిపించారు : రష్మిక మందన్నా

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (10:42 IST)
"గీత గోవిందం" చిత్రంలో నటించి టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన కన్నడ హీరోయిన్ రష్మిక మందన్నా. ఈ ఒక్క సినిమాతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఈ చిత్రానికి ముందు తన ప్రియుడు, కన్నడ హీరో రక్షిత్ శెట్టితో జరిగిన నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకుంది. ఇపుడు ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో టాలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోయిన్‌గా రష్మిక చేరిపోయింది.
 
ఈ నేపథ్యంలో రష్మిక మీడియా "గీత గోవిందం" సెట్‌లో చిత్ర యూనిట్ తనను ఆటపట్టించిన తీరును వెల్లడించింది. ఓసారి 'గీత గోవిందం' షూటింగ్ స్పాట్‌కు వెళ్లడం కొంచెం ఆలస్యం అయిందని చెప్పింది. 'నాతో ఎవరైనా నవ్వుతూ మాట్లాడకపోతే చాలా ఇబ్బంది పడిపోతా. ఆరోజు షూటింగ్ స్పాట్‌కు కొంచెం ఆలస్యంగా వెళ్లడంతో సెట్లో ఎవ్వరూ నాతో మాట్లాడలేదు. నేను పలకరించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో నేను ఓ చోట కూర్చుని ఏడ్చేశా. వెంటనే దర్శకుడు పరశురామ్ అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చారు. "నిన్ను ఆటపట్టించడానికే ఇదంతా చేశాం" అంటూ ఓదార్చారు. అప్పటివరకూ నన్ను ఫాలో అవుతున్న కెమెరాను పరశురామ్ చూపించారు. అసలు నన్ను ఓ కెమెరా ఫాలో అవుతుందని అప్పటివరకూ నాకు తెలియలేదు అని చెప్పుకొచ్చింది. 
 
అదేసమయంలో తనకు పుస్తకాలు ముట్టుకుంటే నిద్ర వచ్చేస్తుందనీ, సినిమా పాటలు మాత్రం బాగా వింటానని రష్మిక తెలిపింది. వంట చేయడం కూడా కొంచెంకొంచెం వచ్చని వెల్లడించింది. ఇక కేక్ అయితే అద్భుతంగా చేస్తానని రష్మిక తన సీక్రెట్‌ను వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments