Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనవాళ్లకు తెలుగమ్మాయిలు పనికిరారా... కుర్రహీరోలకూ వాళ్లే కావాలి

సరైన ఫేస్ వాల్యూ కోసం దేశదేశాలు పట్టుకు తిరుగుతున్న టాలీవుడ్ నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు మన నేటివ్ అందాలు దొరకలేదా. లేక కనబడలేదా లేక చిన్నచూపా అంటే ఎవరూ సమాధానం చెప్పకపోవచ్చు. పైగా టాలెంట్ ఎక్కడుంటే అక్కడికే పోతాం, అలాంటివారితోనే చిత్రాలు చేస్తాం.

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (02:08 IST)
సరైన ఫేస్ వాల్యూ కోసం దేశదేశాలు పట్టుకు తిరుగుతున్న టాలీవుడ్ నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు మన నేటివ్ అందాలు దొరకలేదా. లేక కనబడలేదా లేక చిన్నచూపా అంటే ఎవరూ సమాధానం చెప్పకపోవచ్చు. పైగా టాలెంట్ ఎక్కడుంటే అక్కడికే పోతాం, అలాంటివారితోనే చిత్రాలు చేస్తాం.. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు స్థానికం అనీ, నేటివ్ అనీ, మనవారు అనీ మొహమాటాలు పోతే మొ.ము.క. అంటున్నారు వీళ్లంతా కట్టకట్టుకుని. వీళ్ల టాలెంట్ రంధిలో తెలుగు అమ్మాయిలు సినీపరిశ్రమకు ఆమడదూరంలోనే ఉండిపోతున్నారు ఎలాంటి అవకాశాలూ లేకుండా.
 
సినిమా కథ తయారీకి లేదా వండిపెట్టడానికి థాయిలాండ్ బీచ్‌లకు పరిగెడుతున్న పాడు కాలంలో స్థానిక అందాలు ఎవరికి రుచిస్తాయి చెప్పండి. అందుకే బన్నీ కూడా తన తాజా చిత్రానికి ఒక కన్నడ్ హాట్ గర్ల్‌ ఎంపిక పనిలో పడ్డారట. అల్లు అర్జున్‌ హీరోగా నటించనున్న ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్న రచయిత వక్కంతం వంశీ ఈ చెకింగ్స్‌తో బిజీగా ఉన్నారని వార్తలు. 
 
బన్నీక జోడీగా ఎవరిని పెడితే కెమిస్ట్రీ కుదురుతుంది అన చూస్తున్న నిర్మాత, దర్శకులకు లడ్డూలా దొరికిందట బెంగళూరు బ్యూటీ రష్మికా మందన. కన్నడ హిట్‌ ‘కిరిక్‌ పార్టీ’తో మంచి పేరు తెచ్చుకున్న రష్మిక తెలుగులో అల్లు అర్జున్‌ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమే అనిపిస్తోంది మరి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్ మూర్తి నాయుడు ఇకలేరు

నన్ను ప్రేమించకపోతే నీకు ఎయిడ్స్ ఇంజెక్షన్ చేస్తా: యువతికి ప్రేమోన్మాది బెదిరింపులు

600 కార్లతో అట్టహాసంగా మహారాష్ట్ర వెళ్లిన కేసీఆర్.. ఇప్పుడు అటువైపు కనీసం చూడడం లేదు ఎందుకు?

శివాజీ నడిచిన నేల.. ఎలాంటి దమ్కీలకు భయపడేది లేదు.. పవన్ కల్యాణ్ (video)

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం.. రేవంత్ రెడ్డి కారును తనిఖీ చేసిన పోలీసులు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments