సాయితేజ్‌తో రాశీఖ‌న్నా.. మరోసారి జత కట్టనుందా?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (15:55 IST)
నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే మర్చిపోలేని బిగ్గెస్ట్ హిట్ `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` సినిమాని అందించిన గీతాఆర్ట్స్‌, యు.వి.క్రియేష‌న్స్ కాంబినేషన్ కొత్తగా మారుతి దర్శకత్వంలో సాయితేజ్ సినిమాని సెట్స్‌పైకి తీసుకువెళ్లనున్నారని సమాచారం. ఈ ఏడాది `చిత్ర‌ల‌హ‌రి` స‌క్సెస్ త‌ర్వాత సాయితేజ్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఉండబోతోంది. 
 
సాయితేజ్‌, రాశీఖ‌న్నాలు ఇప్పటికే సుప్రీమ్ సినిమాలో జోడీగా న‌టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సాయితేజ్‌, రాశీఖ‌న్నాల కెరీర్‌లోనే సూప‌ర్‌హిట్ చిత్రంగా నిలిచింది.

ఇప్పుడు వీళ్లిద్దరూ మరోసారి జత కట్టనుండడం, అందులోనూ దర్శకుడు మారుతి కూడా మంచి సక్సెస్‌లతో దూసుకువెళ్తూండడంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డుతున్నాయి. 
 
భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌బోయే ఈ చిత్రంలో స‌త్య‌రాజ్ వంటి భారీ తారాగ‌ణం కూడా న‌టించ‌నున్నారు. కాగా... ఈ సినిమా వ‌చ్చేవారం లాంఛ‌నంగా ప్రారంభం కానుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments